Scholarship: ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ నుంచి ఎంబీఏ స్కాలర్‌షిప్

IDFC FIRST Bank MBA Scholarship | ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఎంబీఏ స్కాలర్‌షిప్ ఆఫర్ చేస్తోంది. ఎంబీఏ, పీజీడీఎం లేదా తత్సమాన మేనేజ్‌మెంట్ కోర్సులు చదవాలనుకునే భారతీయ విద్యార్థులకు ఆర్థికంగా చేయూతను అందిస్తోంది.

news18-telugu
Updated: June 21, 2019, 1:24 PM IST
Scholarship: ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ నుంచి ఎంబీఏ స్కాలర్‌షిప్
Scholarship: ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ నుంచి ఎంబీఏ స్కాలర్‌షిప్ (image: IDFC FIRST Bank)
news18-telugu
Updated: June 21, 2019, 1:24 PM IST
ఎంబీఏ... భారతదేశంలో చాలామంది విద్యార్థులకు ఓ కల. ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులతో పాటు మేనేజ్‌మెంట్ కోర్సులకూ డిమాండ్ ఎక్కువగానే ఉంది. వివిధ విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల్లో ఎంబీఏ కోర్సుల సంఖ్య కూడా పెరుగుతోంది. భారతదేశంలో ఓ మంచి విద్యాసంస్థలో ఎంబీఏ చదవాలంటే ఏడాదికి సగటున రూ.7 లక్షలు ఖర్చవుతుందని అంచనా. దీంతో ప్రతిభ ఉన్నాసరే పేద విద్యార్థులు ఎంబీఏ లాంటి మేనేజ్‌మెంట్ కోర్సులకు దూరమవుతున్నారు. అలాంటి వారిని ఆదుకునేవి స్కాలర్‌షిప్స్. మరి మీరు కూడా ఎంబీఏ చదవాలనుకుంటున్నారా? దేశంలోని మంచి బిజినెస్ స్కూల్‌లో మేనేజ్‌మెంట్ కోర్స్ చేయాలనుకుంటున్నారా? ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఎంబీఏ స్కాలర్‌షిప్ ఆఫర్ చేస్తోంది. ఎంబీఏ, పీజీడీఎం లేదా తత్సమాన మేనేజ్‌మెంట్ కోర్సులు చదవాలనుకునే భారతీయ విద్యార్థులకు ఆర్థికంగా చేయూతను అందిస్తోంది. దేశంలోని 155 బిజినెస్ స్కూల్స్‌లో చదివే విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ స్కీమ్ వర్తిస్తుంది.

IDFC FIRST Bank MBA Scholarship: స్కాలర్‌షిప్ పొందేందుకు అర్హతలివే


ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఎంబీఏ స్కాలర్‌షిప్ 2019-21 బ్యాచ్ విద్యార్థులకు వర్తిస్తుంది. భారతీయ విద్యార్థులు మాత్రమే ఈ స్కాలర్‌షిప్ పొందొచ్చు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షల లోపు ఉన్న విద్యార్థులు స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 2019-21 బ్యాచ్ ఎంబీఏ డిగ్రీ ప్రోగ్రామ్‌లో ఫస్ట్ ఇయర్‌లో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులు మాత్రమే స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఎంబీఏ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌కు ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఎంపిక చేసిన 155 కాలేజీల జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఈ కాలేజీల్లో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులే స్కాలర్‌షిప్‌కు అర్హులు. స్కాలర్‌షిప్‌కు అప్లై చేయడానికి జూలై 31 చివరి తేదీ. దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ తర్వాత విద్యార్థుల్ని ఎంపిక చేస్తారు. స్కాలర్‌షిప్‌కు అర్హత పొందిన విద్యార్థులకు ఏడాదికి రూ.1 లక్ష చొప్పున రెండేళ్లు ఆర్థిక సాయం లభిస్తుంది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఎంబీఏ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Revolt RV400: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఎలక్ట్రిక్ బైక్




ఇవి కూడా చదవండి:
Loading...
SBI Home Loan: ఎస్‌బీఐ హోమ్ లోన్ ఆఫర్... అతి తక్కువ వడ్డీ రేట్లు

IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి దుబాయ్ టూర్... ప్యాకేజీ వివరాలివే

SBI Student Loan: విద్యార్థులకు గుడ్ న్యూస్... ఎస్‌బీఐ నుంచి ఎడ్యుకేషన్ లోన్
First published: June 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...