IDBI Jobs : ఐడీబీఐలో సీఏ, మేనేజర్ జాబ్స్.. చివరితేది దగ్గరికొచ్చేసింది..

ఐడీబీఐ‌లో ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులకి సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..

Amala Ravula | news18-telugu
Updated: April 4, 2019, 6:50 AM IST
IDBI Jobs : ఐడీబీఐలో సీఏ, మేనేజర్ జాబ్స్.. చివరితేది దగ్గరికొచ్చేసింది..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: April 4, 2019, 6:50 AM IST
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ)లో చార్టర్డ్ అకౌంటెంట్, మేనేజర్ పోస్టుల భర్తీకోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. మార్చి 26 నుంచి ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమై ఏప్రిల్ 8న ముగుస్తుంది. గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. డిగ్రీతో పాటు చార్టర్డ్ అకౌంటెంట్, ఎంబీఏ, ఐసీడబ్ల్యూఏ లేదా ఏదైనా స్పెషల్ పీజీ డిగ్రీ అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు : 40
పోస్టులు : డిప్యూటీ జనరల్ మేనేజర్ (గ్రేడ్ డి) -03

అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (గ్రేడ్ సి) -5
మేనేజర్ (గ్రేడ్ బి) 32
విభాగాలు : ఎఫ్‌ఏడీ, టాక్సేషన్ ట్రెజరీ, రిస్క్ మేనేజ్‌మెంట్, కార్పొరేట్ బ్యాంకింగ్


విద్యార్హత : డిగ్రీ(కామర్స్) ఫస్ట్‌క్లాస్‌లో పాస్ అయి ఉండాలి. సీఏ, ఎంబీఏ, ఐసీడబ్ల్యూఏ లేదా ఏదైనా స్పెషల్ పీజీ డిగ్రీ ఉండాలి.
Loading...
వయోపరిమితి : 01.03.2019 నాటికి డీజీఎం పోస్టులకు 35-45
ఏజీఎం పోస్టులకు 28-36
మేనేజర్ పోస్టులకు 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి. (నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి)
దరఖాస్తు ఫీజు : రూ.700(ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.150 చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ ద్వారా
దరఖాస్తు ప్రారంభం : మార్చి 26, 2019
దరఖాస్తుకి చివరితేది : ఏప్రిల్ 8, 2019
ఎంపిక విధానం : దరఖాస్తు చేసిన వారిని మెరిట్ ఆధారంగా గ్రూప్ డిస్కషన్‌కి పిలుస్తారు. అందులో అర్హత సాధించిన వారికి పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అర్హత మార్కులు జనరల్/ఈబీసీ అభ్యర్థులకు 50, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/దివ్యాంగులకు 45 మార్కులుంటాయి. బ్యాంక్ ప్రమాణాల ప్రకారం అభ్యర్థులు మెడికల్ ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది.
వెబ్‌సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి..

Exams Tips : ఇలా చేస్తే ఎగ్జామ్ టెన్షన్ దూరమవుతుంది..
First published: April 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...