హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Bank Jobs: గుడ్ న్యూస్.. ప్రముఖ బ్యాంక్ లో 600 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..

Bank Jobs: గుడ్ న్యూస్.. ప్రముఖ బ్యాంక్ లో 600 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. కేంద్రం నుంచి కూడా పలు రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. వీటితో పాటు.. బ్యాంక్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఏటా ఐబీపీఎస్(IBPS) పలు రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. కేంద్రం నుంచి కూడా పలు రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. వీటితో పాటు.. బ్యాంక్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఏటా ఐబీపీఎస్(IBPS) పలు రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది. ఇలా నిరుద్యోగులు వరుస నోటిఫికేషన్లతో పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. దీనిలో భాగంగానే.. బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు తాజాగా ఐడీబీఐ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 600 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది బ్యాంక్(Bank).

అసిస్టెంట్ మేనేజర్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది బ్యాంక్. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 21న ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 3ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ 600 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీస్ మరియు ఇన్సూరెన్స్ విభాగంలో కనీసం రెండేళ్ల పాటు పని చేసిన అనుభవం ఉండాలి. వయస్సు 21-30 ఏళ్లు ఉండాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏప్రిల్ లో ఆన్లైన్ టెస్ట్ ఉండే అవకాశం ఉందని బ్యాంక్ తెలిపింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, అనంతరం ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఈ ప్రక్రియలు ముగిసన తర్వాత అపాయింట్ మెంట్ వస్తుంది.

Ap SI Preliminary Results: ఏపీ SI ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చేశాయ్..చెక్ చేసుకోండిలా..

దరఖాస్తుల విధానం ఇలా.. 

Step 1: అభ్యర్థులు మొదటగా బ్యాంక్ వెబ్ సైట్ https://www.idbibank.in/ను ఓపెన్ చేయాలి.

Step 2: అనంతరం careers ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 3: తర్వాత Current Openings ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 4: నోటిఫికేషన్ కింద Apply Online ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 5: తర్వాత రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. ముందుగా వివరాలను నమోదు చేసుకుని రిజిస్టర్ చేసుకోవాలి.

Step 6: తర్వాత అప్లికేషన్ ఫామ్ ను నింపి సబ్మిట్ చేసుకోవాలి.

Step 7: భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.

First published:

Tags: Bank Jobs, Bank Jobs 2022, JOBS

ఉత్తమ కథలు