Home /News /jobs /

IDBI BANK RECRUITMENT 2022 NOTIFICATION RELEASED FOR 1544 VACANCIES HERE FULL DETAILS NS

IDBI Bank Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ బ్యాంకులో 1544 జాబ్స్.. ఇలా అప్లై చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ IDBI బ్యాంక్ లో ఖాళీల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ముంబాయి కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఇండస్ట్రియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను (Bank Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ (IDBI Job Notification) విడుదల చేసింది బ్యాంక్. మొత్తం 1544 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది బ్యాంక్. అసిస్టెంట్ మేనేజర్లతో పాటు ఇతర ఎగ్జిక్యూటివ్ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఐడిబీఐ బ్యాంక్ మణిపాల్, నిట్టే (గ్రేట్ నోయిడా) విద్యాసంస్థలతో కలిసి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విభాగంలో ఏడాది (9 నెలల క్యాస్ రూం + 3 నెలల ఇంటర్న్ షిప్), పీజీ డిప్లొమా ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఈ కోర్స్ పూర్తి చేసిన వారికి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం లభిస్తుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు అధికారులు.

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు: ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1544 ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఇందులో 1044 ఎగ్జిక్యూటివ్ ఖాళీలు కాగా.. మరో 500 అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ తో పాటు కంప్యూటర్ ఆపరేషన్స్, లాంగ్వేజ్ లో డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని ప్రకటనలో స్పష్టం చేశారు.
    వయస్సు: అభ్యర్థుల వయస్సు ఏప్రిల్ 1 నాటికి 20 నుంచి 25 ఏళ్లు ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్న వారి వయస్సు 21 నుంచి 28 ఏళ్లు ఉండాలి.
    అభ్యర్థుల ఎంపిక: ఆన్లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు.
    పరీక్షా విధానం: మొత్తం 200 మార్కులకు ఈ ఎగ్జామ్ ఉంటుంది. నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతీ మిస్టేక్ కు 0.25 మర్కుల కోత ఉంటుంది.
    UPSC Coaching: యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారా..? అయితే ఫ్రీ కోచింగ్ అందిస్తున్న సంస్థలు ఇవే..


    దరఖాస్తు ఇలా:
    Step 1: అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
    Step 2: అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్ సైట్లో http://www.idbibank.in/ అప్లై చేసుకోవాలి.
    Step 3: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ జూన్ 3 అంటే రేపటి నుంచి ప్రారంభం అవుతుంది.
    Step 4: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, PWD అభ్యర్థులు రూ.200 చెల్లిస్తే సరిపోతుంది,
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Bank Jobs, IDBI Bank, Job notification, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు