IDBI Bank Recruitment 2021: ఐడీబీఐ బ్యాంకులో డిగ్రీ అర్హతతో 920 ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ ఐడీబీఐ బ్యాంక్ 920 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 18లోగా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    ప్రముఖ ఐడీబీఐ బ్యాంక్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఎగ్జిక్యూటీవ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు బ్యాంక్ తెలిపింది. ఈ మేరకు బ్యాంక్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 920 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలగిన అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ idbibank.inలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 4న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 18ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 29 వేల వేతనం చెల్లించనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు.
    Andhra Pradesh: ఏపీలో ఈ రోజు భారీ జాబ్ మేళా.. Flipkart, Airtel, Hero, Amar Rajaతో పాటు పది కంపెనీల్లో ఉద్యోగాలు.. వివరాలివే
    APCOB Jobs: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. ఆప్కాబ్ లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఈ రోజే లాస్ట్ డేట్.. ఇలా అప్లై చేసుకోండి

    మొత్తం ఖాళీలు: 920
    ఇందులో ఎస్సీ అభ్యర్థులకు 138, ఎస్టీలకు 69, ఓబీసీ అభ్యర్థులకు 248, EWS అభ్యర్థులకు 92 పోస్టులను కేటాయించగా అన్ రిజర్వ్డ్ కేటగిరిలో 373 పోస్టులు ఉన్నాయి.

    విద్యార్హతల వివరాలు..
    అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 55 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, PWD అభ్యర్థులు 50 శాతం మార్కులను అర్హతగా నిర్ణయించారు. అభ్యర్థుల వయస్సు 20 నుంచి 25 ఏళ్లు ఉండాలి.

    ఇతర వివరాలు..
    -అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ idbibank.in వెబ్ సైట్ ను ఓపెన్ చేసి, కెరీర్ ఆప్షన్ ను ఎంపిక చేసి దరఖాస్తు చేసుకోవాలి.
    -దరఖాస్తు చేసిన అనంతరం అప్లికేషన్ ఫామ్ ను భద్రపరుచుకోవాలి.
    -ఆన్లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో రూ. 1000 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు. వారి రూ. 200లను పరీక్ష ఫీజుగా నిర్ణయించారు. అయితే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సెప్టెంబర్ 5న ఎగ్జామ్ నిర్వహించనున్నారు.
    Published by:Nikhil Kumar S
    First published: