• HOME
 • »
 • NEWS
 • »
 • JOBS
 • »
 • IDBI BANK RECRUITMENT 2021 IDBI BANK RELEASED NOTIFICATION FOR VARIOUS VACANCIES KNOW ALL DETAILS SS

IDBI Bank Recruitment 2021: ఐడీబీఐ బ్యాంకులో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

IDBI Bank Recruitment 2021: ఐడీబీఐ బ్యాంకులో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

IDBI Bank Recruitment 2021: ఐడీబీఐ బ్యాంకులో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

IDBI Bank Recruitment 2021 | ఐడీబీఐ బ్యాంక్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. భర్తీ చేసే పోస్టులతో పాటు నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

 • Share this:
  ఐడీబీఐ బ్యాంక్ పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. చీఫ్ డేటా ఆఫీసర్, హెడ్ ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) కాంప్లయెన్స్, డిప్యూటీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, హెడ్ డిజిటల్ బ్యాంకింగ్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 6 ఖాళీలున్నాయి ఇవి మూడేళ్ల కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 మే 3 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఐడీబీఐ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ https://www.idbibank.in/ ఓపెన్ చేసి కెరీర్స్ సెక్షన్‌లో చూడొచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసి, పూర్తి చేసి చివరి తేదీలోగా నోటిఫికేషన్‌లో వెల్లడించిన మెయిల్ ఐడీకి పంపాలి. దరఖాస్తు చేసేముందు విద్యార్హతలు, అనుభవం లాంటి వివరాలన్నీ నోటిఫికేషన్‌లో తెలుసుకోవాలి.

  IDBI Bank Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


  మొత్తం ఖాళీలు- 6
  చీఫ్ డేటా ఆఫీసర్- 1
  హెడ్ ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) కాంప్లయెన్స్- 1
  డిప్యూటీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (ఛానెల్స్)- 1
  డిప్యూటీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (డిజిటల్)- 1
  చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్- 1
  హెడ్ డిజిటల్ బ్యాంకింగ్- 1

  Exams: కరోనా ఎఫెక్ట్‌తో ఇప్పటివరకు రద్దైన, వాయిదాపడ్డ ఎగ్జామ్స్ ఇవే

  Jobs in Kia Motors: కియా మోటార్స్‌లో 200 ఉద్యోగాలు... ఇంటర్వ్యూ ఎప్పుడంటే

  IDBI Bank Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


  దరఖాస్తు ప్రారంభం- 2021 ఏప్రిల్ 20
  దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మే 3
  విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
  అనుభవం- ప్రతీ పోస్టుకు అనుభవం తప్పనిసరి
  కాంట్రాక్ట్- మూడేళ్ల కాంట్రాక్ట్ ఉంటుంది. ఆ తర్వాత అవసరాన్ని బట్టి 5 ఏళ్ల వరకు కాంట్రాక్ట్ పొడిగించొచ్చు.

  TSPSC Recruitment 2021: గుడ్ న్యూస్... తెలంగాణలో ఆ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువు పెంపు

  DRDO Recruitment 2021: డీఆర్‌డీఓలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే

  IDBI Bank Recruitment 2021: దరఖాస్తు విధానం ఇదే


  అభ్యర్థులు ముందుగా https://www.idbibank.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  హోమ్ పేజీలో Careers పైన క్లిక్ చేయాలి.
  ఆ తర్వాత Current Openings పైన క్లిక్ చేయాలి.
  Appointment of Expert – Information Technology (IT) & CISO (Contract Basis) నోటిఫికేషన్ ఉంటుంది.
  అందులో Application Format పైన క్లిక్ చేయాలి.
  దరఖాస్తు ఫామ్ ఓపెన్ అవుతుంది.
  దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని, పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జతచేసి recruitment@idbi.co.in మెయిల్ ఐడీకి చివరి తేదీలోగా పంపాలి.
  Published by:Santhosh Kumar S
  First published: