Bank Jobs: ఐడీబీఐ బ్యాంక్‌లో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్

IDBI Bank SO Recruitment 2019 | ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ఐడీబీఐ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ https://www.idbibank.in/ ఓపెన్ చేసి కెరీర్ సెక్షన్‌లో చూడొచ్చు.

news18-telugu
Updated: December 10, 2019, 11:16 AM IST
Bank Jobs: ఐడీబీఐ బ్యాంక్‌లో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్
Bank Jobs: ఐడీబీఐ బ్యాంక్‌లో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
బ్యాంకులో ఉద్యోగం కోరుకునేవారికి శుభవార్త. ఐడీబీఐ బ్యాంకులో  స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. మొత్తం 61 ఉద్యోగాలున్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు డిసెంబర్ 12 చివరి తేదీ. మేనేజర్, ఏజీఎం, గ్రేడ్ ఏజీఎం లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఐడీబీఐ బ్యాంక్. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ఐడీబీఐ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ https://www.idbibank.in/ ఓపెన్ చేసి కెరీర్ సెక్షన్‌లో చూడొచ్చు.

IDBI Bank SO Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...



మొత్తం ఖాళీలు- 61 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
గ్రేడ్ డీజీఎం (గ్రేడ్ డీ)- 2
ఏజీఎం (గ్రేడ్ సీ)- 5
మేనేజర్ (గ్రేడ్ బీ)- 54
దరఖాస్తు ప్రారంభం- 2019 నవంబర్ 28దరఖాస్తుకు చివరి తేదీ- డిసెంబర్ 12
విద్యార్హత- అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుకు అగ్రికల్చర్ / హార్టికల్చర్ / వెటర్నరీ సైన్స్ / ఫిషరీస్ / డెయిరీ టెక్నాలజీ అండ్ యానిమల్ హజ్బెండరీ 60% మార్కులతో పాస్ కావాలి. వయస్సు 25 నుంచి 35 ఏళ్లు.
బిహేవిరయల్ సైన్సెస్ ఫ్యాకల్టీ పోస్టుకు హెచ్ఆర్ఎంలో ఎంబీఏ, బిహేవియర్ సైన్సెస్‌ లేదా సైకాలజీ పీజీ చదవాలి. వయస్సు 35 నుంచి 45 ఏళ్లు.
ఫ్రాడ్ రిస్క్ మేనేజ్‌మెంట్ పోస్టుకు కామర్స్‌లో 60% మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలి. వయస్సు 25 నుంచి 35 ఏళ్లు.
ట్రాన్సాక్షన్ మానిటరింగ్ టీమ్ పోస్టుకు సర్టిఫైడ్ ఫ్రాడ్ ఎగ్జామినర్ క్వాలిఫికేషన్‌తో పాటు గ్రాడ్యుయేషన్ లేదా ఎంబీఏ లేదా సీఏ పాస్ కావాలి. వయస్సు 35 నుంచి 45 ఏళ్లు.
స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఐడీబీఐ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Vivo S1: వివో ఎస్1 ధర తగ్గింది... ఫోన్ ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Government Jobs: ఇంటర్ పాసైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం... అప్లై చేయండి ఇలా

HPCL Jobs: హెచ్‌పీసీఎల్‌ విశాఖ రిఫైనరీలో జాబ్స్... డిప్లొమా, డిగ్రీ అర్హత

Railway Jobs: ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 1216 ఉద్యోగాలు... ఆంధ్రప్రదేశ్‌లోనూ ఖాళీలు
Published by: Santhosh Kumar S
First published: December 10, 2019, 11:16 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading