Home /News /jobs /

ICSI CS FOUNDATION EXAM 2021 NOTIFICATION RELEASED HERE FULL DETAILS NS GH

CS Foundation Exam: సీఎస్ ఫౌండేషన్ పరీక్ష తేదీలను ప్రకటించిన ICSI.. అభ్యర్థులకు సూచనలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కంపెనీ సెక్రటరీ ఫౌండేషన్‌ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా(ICSI) విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కంపెనీ సెక్రటరీ ఫౌండేషన్‌ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా(ICSI). సీఎస్ ఫౌండేషన్ ఎగ్జామ్- 2021 పరీక్ష షెడ్యూల్‌ను సంస్థ విడుదల చేసింది. ఆన్ లైన్‌లో రాసే ఈ పరీక్షను రిమోట్ ప్రోక్టోర్డ్ మోడ్ ద్వారా ఆగస్టులోనే నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక పోర్టల్ icsi.eduను సందర్శించాలని సూచించింది. తాజా నోటిఫికేషన్‌లో మరిన్ని వివరాలను పొందుపర్చింది. అవేంటంటే.. సీఎస్ ఫౌండేషన్ పరీక్ష ఆగస్టు 13, 14 తేదీల్లో జరగనుంది. ఆగస్టు 3న విడుదలైన ఈ నోటీసు ప్రకారం అభ్యర్థులు ఎక్కడ నుంచైనా రిమోట్ ప్రోక్టోర్డ్ మోడ్ ద్వారా హాజరు కావచ్చు. దీనర్థం వారు వారి ఇంటి నుంచి లేదా సౌకర్యవంతమైన ప్రదేశం నుంచి పరీక్ష రాయవచ్చు. మెరుగైన ఇంటర్నెట్ వేగం, ల్యాప్ టాప్ లేదా డెస్క్ టాప్ ఉపయోగించడం ద్వారా పరీక్షకు అవాంతరం లేకుండా చూసుకోవడం మంచిది.
UGC NET 2021: యూజీసీ నెట్​ క్వాలిఫైడ్​ అభ్యర్థులకు ఊరట.. NTA కీలక నిర్ణయం.. వివరాలివే
NEET 2021: నీట్ 2021 పరీక్షల రిజిస్ట్రేషన్ గడువు పెంచిన NTA.. కొత్త షెడ్యూల్ ఇదే..

నోటీస్ ప్రకారం అభ్యర్థులు పరీక్ష రాసేందుకు.. అందుబాటులో ఉన్న రెండు ఆప్షన్లలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలి. రిమోట్ ప్రోక్టోర్డ్ మోడ్ లేదా సీబీఈ పరీక్ష కేంద్రం నుంచి పరీక్ష రాసే ఆప్షన్‌ను అభ్యర్థులు సెలక్ట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి అభ్యర్థులకు వివరణాత్మక సూచనలతో ఈమెయిల్ లేదా ఎస్ఎంఎస్ పంపిస్తారు. విద్యార్థులు చెక్ చేసుకోవడానికి సైట్‌లో కొన్ని FAQలు అప్ లోడ్ చేస్తామని ఇనిస్టిట్యూట్ పేర్కొంది.

పరీక్ష తేదీల్లో ఎలాంటి మార్పు ఉండదని, షెడ్యూల్ ప్రకారమే పరీక్ష జరుగుతుందని ఐసీఎస్ఐ అభ్యర్థులకు నోటీసు ద్వారా తెలియజేసింది. రిజిస్ట్రేషన్ సమయంలో విద్యార్థులకు సూచించిన అన్ని నియమాలు తప్పకుండా పాటించాలని తెలిపింది. సిలబస్, ప్రశ్న పత్రాల నమూనా, మార్కింగ్, సమాధానాల సబ్మిషన్ లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. అభ్యర్థుల కోసం ఐసీఎస్‌ఐ ఓ మాక్ టెస్ట్ కూడా నిర్వహించనుంది. ఈ మాక్ టెస్టుకు సంబంధించి మరిన్ని వివరాలు ఐసీఎస్ఐ అప్డేట్ చేయనుంది. అందువల్ల మాక్ టెస్ట్, పరీక్షకు సంబంధించిన అప్‌డేట్‌ల కోసం సంస్థ వెబ్‌సైట్‌ను అభ్యర్థులు తరచుగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Exams

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు