హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Exam Results: విద్యార్థులకు అలర్ట్.. నేడు 10, 12వ తరగతి ఫలితాలు.. రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి

Exam Results: విద్యార్థులకు అలర్ట్.. నేడు 10, 12వ తరగతి ఫలితాలు.. రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా నేపథ్యంలో రద్దు అయిన మరో పరీక్ష ఫలితాల విడుదలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.

కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా రద్దు అయిన పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ఆయా ప్రభుత్వాలు, బోర్డులు విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణతో పాటు ఏపీలోనూ ఇంటర్ ఫలితాలను అధికారులు విడుదల చేశారు. తాజాగా ఐసీఎస్ఈ, ఐఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ ఫలితాలను ఈ రోజు మధ్యాహ్నం విడుదల చేయనున్నారు. ఈ వివరాలను భారత పాఠశాల విద్య ధ్రువీకరణ పరీక్షల మండలి (CISCE) అధికారికంగా వెల్లడించింది. ఇండియ‌న్ స‌ర్టిఫికెట్ ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్‌(ICSE) 10వ త‌ర‌గ‌తి, ఇండియ‌న్ స్కూల్ స‌ర్టిఫికెట్(ISE) 12వ త‌ర‌గ‌తి పరీక్షల ఫతితాలను ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది. అభ్యర్థులు cisce.org లేదా results.cisce.org వెబ్ సైట్ల ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చని వివరించింది.

విద్యార్థులకు అలర్ట్.. ఈ నెల 28న ఆ పరీక్ష ఫలితాలు.. వివరాలివే

EAMCET, NEET, JEEకి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు తెలంగాణ సర్కార్ శుభవార్త.. వివరాలివే

కరోనా విజృంభణ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ సాధ్యం కాకపోవడంతో ఈ పరీక్షలను కేంద్రం రద్దు చేసింది. దీంతో ప్రతిభ ఆధారంగా విద్యార్థుల ఫలితాలను వెల్లడించడానికి అధికారులు నిర్ణయించారు. అయితే విద్యార్థులు తాము పొందిన మార్కులపై ఏమైనా అభ్యంతరాలుంటే వారి పాఠశాలలను సంప్రదించాలని అధికారులు సూచించారు. ఈ ఫిర్యాదుల నమోదుకు ఆగస్టు 1 వరకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే.. కరోనా నేపథ్యంలో గతేడాదితో పాటు ఈ ఏడాది కూడా అధికారులు టెన్త్ ఎగ్జామ్స్ ను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే.. పరీక్షలను రద్దు చేస్తున్న సమయంలో విద్యార్థులకు మార్కులను కేటాయించే విధానం సరిగా ఉండడం లేదన్న విమర్శలు వివిధ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ అధికారులు వార్షిక పరీక్షల నిర్వహణలో మార్పులు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

ఇందుకోసం రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (NCERT)తో ప్రభుత్వ పరీక్షల విభాగం(SSC Board) అధికారులు చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. సీబీఎస్ఈ బోర్డు ప్రకటించినట్లుగా రాష్ట్రంలోనూ ఏడాదికి రెండు సార్లు పరీక్షలు జరిపే అంశంపై అధికారులు చర్చించనున్నారు. ఇంకా ఫార్మెటివ్ అసెస్మెంట్ ప్రశ్నపత్రాలు రాష్ట్రం మొత్తం ఒకేలా ఉంటే బాగుంటుందన్న నిర్ణయానికి అధికారులు వచ్చారు.

First published:

Tags: CBSE, CISCE, Exam results

ఉత్తమ కథలు