కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్(CISCE) 10వ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. ICSE సెమిస్టర్ 2 ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు 10వ తరగతి పరీక్ష ఫలితాలను ఈ వెబ్ సైట్లో results.cisce.org చూసుకోవచ్చు. 99.97 శాతం మంది ఈ పరీక్షలో ఉత్తీర్ణులు అయినట్లు అధికారులు పేర్కొన్నారు.
మొత్తం 2,31,063 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వారిలో 99.97% మంది విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. 99.98% బాలికలు మరియు 99.97% బాలురు పరీక్షలలో ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాల్లో బాలుర కంటే బాలికల ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉంది.
కేటగిరీ వారీగా ఉత్తీర్ణత శాతాన్ని ఇలా..
12,980 మంది షెడ్యూల్డ్ కులాల(SC) అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా.. 99.97 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంకా.. 7975 షెడ్యూల్డ్ తెగ(ST) అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా.. 99.94శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇతర వెనుకబడిన తరగతుల(ఓబీసీ) అభ్యర్థుల్లో 49,731 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా.. 99.99 శాతం మంది ఉత్తీర్ణులు అయ్యారు.
టాపర్స్ వీరే..
ముగ్గురు బాలికలు, ఒక బాలుడికి సంయుక్తంగా ప్రథమ ర్యాంక్ సాధించారు. ఈ విద్యార్థులందరూ ఒక్కొక్కరు 99.80% మార్కులు సాధించారు.
Rank 1: పూణెలోని సెయింట్ మేరీస్ స్కూల్‌కు చెందిన.. హర్గున్ కౌర్ మాథారు
Rank 1: కాన్పూర్‌లోని షీలింగ్ హౌస్ స్కూల్ కు చెందిన.. అనికా గుప్తా
Rank 1: లక్నోలోని కాన్పూర్ రోడ్‌లోని సిటీ మాంటిస్సోరి పాఠశాలకు చెందిన.. కనిష్క మిట్టల్
Rank 1: జీసస్ అండ్ మేరీ స్కూల్ అండ్ కాలేజ్ బలరాంపూర్ కు చెందిన.. పుష్కర్ త్రిపాఠి
ఈ పరీక్షలో ఫెయిల్ అయిన వారు ఏం చేయాలి..?
CISCE 10వ తరగతి లేదా ICSE ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థులకు మరో అవకాశం ఉంటుంది. విద్యార్థులు రిపీటర్ కేటగిరీ కింద ఆ సంవత్సరం విద్యార్థులతో పాటు 2023 చివరి సంవత్సరం పరీక్షలు రాయవచ్చు. అయితే.. విద్యార్థులు ఆ సంవత్సరం కూడా ఉత్తీర్ణత సాధించకపోతే.. తర్వాత ఎలాంటి అవకాశం ఉండదు. రీ చెకింగ్ లేదా రీ కౌంటింగ్ కొరకు అభ్యర్థులు.. కౌన్సిల్ వెబ్‌సైట్ www.cisce.org ద్వారా దరఖాస్తు చేసుకుకోవచ్చు. ఒక్కో పేపర్‌కు రూ.1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రీషెడ్యూలింగ్ ఈసారి సెమిస్టర్ 2 పరీక్షలకు మాత్రమే అనుమతించబడుతుంది. ఎందుకంటే సెమిస్టర్ 1 పరీక్షలకు అంతకముందే ఈ అవకాశాన్ని ఇచ్చారు. రీచెకింగ్ జూలై 17 నుండి జూలై 23 వరకు అందుబాటులో ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 10th class results, Career and Courses, JOBS, Results