ICSE 10th ISC 12th Result 2020: ఇవాళే ఐసీఎస్‌ఈ 10వ, ఐఎస్‌సీ 12వ తరగతి ఫలితాలు... చెక్ చేయండి ఇలా

ICSE 10th and ISC 12th Result 2020 | ఐసీఎస్‌ఈ 10వ తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త. మరికొన్ని గంటల్లో ఫలితాలు విడుదల కానున్నాయి. ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.

news18-telugu
Updated: July 10, 2020, 10:02 AM IST
ICSE 10th ISC 12th Result 2020: ఇవాళే ఐసీఎస్‌ఈ 10వ, ఐఎస్‌సీ 12వ తరగతి ఫలితాలు... చెక్ చేయండి ఇలా
ICSE 10th ISC 12th Result 2020: ఇవాళే ఐసీఎస్‌ఈ 10వ, ఐఎస్‌సీ 12వ తరగతి ఫలితాలు... చెక్ చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఐసీఎస్‌ఈ 10వ తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి ఫలితాలు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానున్నాయి. ఐసీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్స్ అయిన https://www.cisce.org/ లేదా https://results.cisce.org/ ఓపెన్ చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. జూలై 10 మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలు విడుదల చేస్తామని కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్-CISCE ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు రిజల్ట్స్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరి ఫలితాలు ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.

Nestle Internship: ఇంటి నుంచే ఇంటర్న్‌షిప్... 1,000 మందికి అవకాశం

ముందుగా ఐసీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్స్ https://www.cisce.org/ లేదా https://results.cisce.org/ ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో ఫలితాలకు సంబంధించిన లింక్ పైన క్లిక్ చేయాలి. లేదా Course ఆప్షన్ ఎంచుకోవాలి.
ఆ తర్వాత యూనిక్ ఐడీ, ఇండెక్స్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
ఫలితాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి. ఫలితాల కాపీని ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

Bank Jobs: బ్యాంక్ జాబ్ మీ కలా? 9640 ఉద్యోగాలను భర్తీ చేస్తున్న ఐబీపీఎస్ఐసీఎస్ఈ 10వ తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి ఫలితాలను ఎస్ఎంఎస్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఐసీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులు ICSE<Space><Unique Id>, ఐఎస్‌సీ 12వ తరగతి విద్యార్థులు ISC<Space><Unique Id> అని టైప్ చేసి 09248082883 నెంబర్‌కు మెసేజ్ పంపాలి. ఫలితాలపై ఏవైనా సందేహాలు ఉంటే ciscehelpdesk@orioninc.com ఇమెయిల్ ఐడీ లేదా 1800-267-1760 నెంబర్‌కు కాల్ చేయొచ్చు.
Published by: Santhosh Kumar S
First published: July 10, 2020, 10:02 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading