ICSE ISC Exams 2022: ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ పరీక్షల్లో సమూల మార్పులు.. కొత్త మోడల్ ఇదే...!

ప్రతీకాత్మకచిత్రం

విద్యావిధానంలో పెను మార్పులు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. నూతన విద్యావిధానానికి (New Education System) అనుగుణంగా విద్యా సంస్కరణలు చేపట్టింది.

  • Share this:
విద్యావిధానంలో పెను మార్పులు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. నూతన విద్యా విధానానికి అనుగుణంగా విద్యా సంస్కరణలు చేపట్టింది. దీనిలో భాగంగా ఈ విద్యా సంవత్సరం నుంచి ఐసీఎస్ఈ, ఐఎస్సీ పరీక్షల నిర్వహణకు సీబీఎస్సీ మోడల్ను పాటిస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించి కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్సీఈ) 2021–22 సవరించిన షెడ్యూల్ను విడుదల చేసింది. దీని ప్రకారం, ఇకపై ఐసీఎస్సీ, ఐఎస్సీ పరీక్షలను కూడా సీబీఎస్ఈ వలే రెండు టర్మ్ మోడల్‌లో నిర్వహిస్తారు. అంటే, ఇకపై ఐసిఎస్‌ఈ, ఐఎస్‌సి 10, 12 తరగతుల పరీక్షలు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్‌ఈ) రెండు సెమిస్టర్లలో జరగనున్నాయి. ప్రతి సెమిస్టర్‌లో దాదాపు 50% సిలబస్ కవర్ అవుతుంది. ఈ కొత్త విధానానికి సంబంధించిన మరిన్ని వివరాలను CISCE అధికారిక వెబ్‌సైట్- www.cisce.org ద్వారా చెక్ చేసుకోవాలని సీఐఎస్సీఈ విద్యార్థులను కోరింది.

సెమిస్టర్ విధానంలో పరీక్షలు ఇలా..
సెమిస్టర్ 1లో భాగంగా 2021 నవంబర్లో మొదటి 50 శాతం సిలబస్ ప్రకారం ఆన్‌లైన్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఇక, సెమిస్టర్ 2లో భాగంగా 2022 మార్చి/ఏప్రిల్ నెలల్లో దేశంలోని కరోనా పరిస్థితిని బట్టి ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ మోడ్లో మిగతా 50 శాతం సిలబస్పై పరీక్ష నిర్వహిస్తారు.

ఇది చదవండి: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల షెడ్యూల్ విడుదల... ఏ పరీక్ష ఎప్పుడో ఇలా తెలుసుకోండి…


తాజా మార్పులివే..
1. ICSE విధానానికి సంబంధించి ప్రతి సెమిస్టర్లోని ప్రతి సబ్జెక్టు ప్రశ్నా పత్రం 80/100 మార్కులకు ఉంటుంది. ఇక, ISC విధానంలో మాత్రం 70/80 మార్కులు ఉంటాయి. ఏదేమైనా, రెండు సెమిస్టర్లలో వచ్చిన మార్కుల సగటు తీసుకొని చివరి ఫలితాలను ప్రకటిస్తారు.

2. ఐఎస్సీ విధానంలో కేవలం సెమిస్టర్ పరీక్షల్లో వచ్చిన మార్కులే కాకుండా, ప్రాక్టికల్/ప్రాజెక్ట్ వర్క్‌లో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా విద్యార్థులకు మార్కులు కేటాయిస్తారు. దీనికి కూడా కొంత వెయిటేజీ ఉంటుంది.

3. ఐసీఎస్సీ విద్యార్థుల కోసం ఇంటర్నల్ అసెస్‌మెంట్ కూడా నిర్వహిస్తారు. దీనికి కూడా గతంలో మాదిరిగానే మార్కుల వెయిటేజీ ఉంటుంది.

4. ఒకవేళ దేశంలో కరోనా పరిస్థితులు అనుకూలంగా ఉంటే, ISC ప్రాక్టికల్స్ పరీక్షలను ఆఫ్‌లైన్‌ విధానంలోనే నిర్వహిస్తారు. లేదంటే, ప్రాక్టికల్స్ పరీక్షలు యథాతథంగా ఆన్లైన్లోనే నిర్వహిస్తారు.

5. ఉపాధ్యాయులు విధిగా విద్యార్థుల ప్రాక్టికల్/ప్రాజెక్ట్ వర్క్/ఇంటర్నల్ అసెస్‌మెంట్/SUPW మార్కులను CAREERS పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. వీటిని రెండవ సెమిస్టర్ మార్కుల్లో పరిగణలోకి తీసుకుంటారు.
Published by:Purna Chandra
First published: