Jobs: పీజీ పాసైనవారికి 150 జేఆర్ఎఫ్ పోస్టులు... వివరాలివే

ICMR Recruitment 2020 | మీరు పీజీ పాసయ్యారా? మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-ICMR నోటిఫికేషన్ విడుదల చేసింది.

news18-telugu
Updated: March 20, 2020, 6:45 PM IST
Jobs: పీజీ పాసైనవారికి 150 జేఆర్ఎఫ్ పోస్టులు... వివరాలివే
Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మనూలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
  • Share this:
పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాసైనవారికి శుభవార్త. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-ICMR జూనియర్ రీసెర్చ్ ఫెలో-JRF పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 150 ఖాళీలను ప్రకటించింది. సోషల్ సైన్సెస్, బయోమెడికల్ సైన్సెస్‌తో పాటు పలు విభాగాల్లో వీరిని నియమించనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 ఏప్రిల్ 27న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు 2020 మే 27 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు https://icmr.nic.in/ లేదా http://pgimer.edu.in/ వెబ్‌సైట్స్‌లో చూడొచ్చు.

ICMR Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...



జూనియర్ రీసెర్చ్ ఫెలో ఖాళీలు- 150
నోటిఫికేషన్ విడుదల- 2020 మార్చి 19
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 ఏప్రిల్ 27
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మే 27
విద్యార్హత- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంఎస్సీ, ఎంఏ లేదా తత్సమాన డిగ్రీ 55% మార్కులతో పాస్ కావాలి.వయస్సు- 28 ఏళ్లు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1500. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1,200. వికలాంగులకు ఫీజు లేదు.
ఎంపిక విధానం- దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుకు ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Govt Jobs: కరోనా ఎఫెక్ట్... 147 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కొత్త షెడ్యూల్

Central Govt Jobs: సశస్త్ర సీమా బల్‌లో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

Indian Railways: నిరుద్యోగులకు భారతీయ రైల్వే రాయితీలు... వివరాలివే
Published by: Santhosh Kumar S
First published: March 20, 2020, 6:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading