Home /News /jobs /

ICMR RECRUITMENT 2020 INDIAN COUNCIL OF MEDICAL RESEARCH RELEASED NOTIFICATION FOR 141 SCIENTIST B POSTS SS

ICMR Jobs: ఐసీఎంఆర్‌లో 141 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

ICMR Jobs: ఐసీఎంఆర్‌లో 141 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

ICMR Jobs: ఐసీఎంఆర్‌లో 141 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

ICMR Recruitment 2020 | ఐసీఎంఆర్ సైంటిస్ట్ బీ పోస్టుల్ని భర్తీ చేయనుంది. 141 పోస్టులున్నాయి. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

    కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్‌ ఆధ్వర్యంలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-ICMR ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 141 సైంటిస్ట్ బీ పోస్టుల్ని భర్తీ చేయనుంది. న్యూ ఢిల్లీలోని ఐసీఎంఆర్, చండీగఢ్‌లోని PGIMER సంయుక్తంగా రిక్రూట్‌మెంట్ టెస్ట్ నిర్వహించి ఈ పోస్టుల్ని భర్తీ చేస్తుంది. న్యూ ఢిల్లీలోని ఐసీఎంఆర్ హెడ్‌క్వార్టర్స్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ఐసీఎంఆర్ కేంద్రాలు, ఇన్‌స్టిట్యూట్స్‌లో ఈ పోస్టులున్నాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు https://www.icmr.gov.in/ లేదా https://pgimer.edu.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 అక్టోబర్ 2 చివరి తేదీ.

    IBPS Clerk Jobs: మొత్తం 2557 క్లర్క్ పోస్టుల భర్తీ... తెలంగాణ, ఏపీలో ఖాళీల వివరాలివే

    Telangana Jobs: తెలంగాణ వాణిజ్య శాఖలో 161 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    ICMR Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలు ఇవే...


    మొత్తం పోస్టులు- 141
    సైంటిస్ట్ బీ మెడికల్- 72
    సైంటిస్ట్ బీ నాన్ మెడికల్- 69
    దరఖాస్తు ప్రారంభం- 2020 సెప్టెంబర్ 12
    దరఖాస్తుకు చివరి తేదీ- 2020 అక్టోబర్ 2
    అడ్మిట్ కార్డ్ విడుదల- 2020 అక్టోబర్ 20
    కంప్యూటర్ బేస్డ్ టెస్ట్- 2020 నవంబర్ 1
    ఫలితాల విడుదల- 2020 నవంబర్ 20
    విద్యార్హత- మెడికల్ అసిస్టెంట్ పోస్టుకు ఎంబీబీఎస్ డిగ్రీ. నాన్ మెడికల్ అసిస్టెంట్ పోస్టుకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ.
    వయస్సు- 35 ఏళ్లు
    దరఖాస్తు ఫీజు- ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళలకు రూ.1500. ఇతరులకు రూ.2000.
    ఎంపిక విధానం- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ
    వేతనం- రూ.1,70,000
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, Exams, ICMR, Job notification, JOBS, NOTIFICATION

    తదుపరి వార్తలు