Jobs: ఉద్యోగాల భర్తీకి ఐసీఎంఆర్ నోటిఫికేషన్... ఖాళీల వివరాలివే

ICMR-NIMR Recruitment 2020 | నిరుద్యోగులకు గుడ్ న్యూస్. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్-NIMR పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: May 11, 2020, 1:39 PM IST
Jobs: ఉద్యోగాల భర్తీకి ఐసీఎంఆర్ నోటిఫికేషన్... ఖాళీల వివరాలివే
Jobs: ఉద్యోగాల భర్తీకి ఐసీఎంఆర్ నోటిఫికేషన్... ఖాళీల వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్-ICMR ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్-NIMR ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్, సైంటిస్ట్ బీ, సీ, ప్రాజెక్ట్ ఆఫీసర్ / సెక్షన్ ఆఫీసర్, ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్, ఐటీ మేనేజర్ / వెబ్ మేనేజర్, సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ / యూడీసీ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 మే 18 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://nimr.org.in/ లేదా https://www.icmr.gov.in/ వెబ్‌సైట్లలో తెలుసుకోవచ్చు.

ICMR-NIMR Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...



మొత్తం పోస్టులు- 24
మల్టీ టాస్కింగ్ స్టాఫ్- 4
సైంటిస్ట్ సీ (మెడికల్ మైక్రోబయాలజీ)- 3
సైంటిస్ట్ బీ (నాన్ మెడికల్)- 3
ప్రాజెక్ట్ ఆఫీసర్ / సెక్షన్ ఆఫీసర్- 4ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్- 4
ఐటీ మేనేజర్ / వెబ్ మేనేజర్- 2
సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ / యూడీసీ- 4

ICMR-NIMR Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రారంభం- 2020 మే 8
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మే 18 సాయంత్రం 5 గంటలు
దరఖాస్తు విధానం- ఐసీఎంఆర్ లేదా ఎన్ఐఎంఆర్ అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసి, పూర్తి చేసి recruitment.nimr.icmr@gmail.com మెయిల్ ఐడీకి 2020 మే 18 సాయంత్రం 5 గంటల్లోగా పంపాలి.
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
ఎంపిక విధానం- దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ. కోవిడ్ 19 మహమ్మారి కారణంగా స్కైప్ లేదా వీడియో కాల్‌లో ఇంటర్వ్యూ ఉంటుంది.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Telangana Jobs: తెలంగాణ హైకోర్టులో జాబ్స్... మరోసారి దరఖాస్తు గడువు పెంపు

IOCL Jobs: ఐఓసీఎల్‌లో ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పొడిగింపు

Free Courses: కొత్తగా ఏదైనా నేర్చుకోవాలా? ఈ 49 ఆన్‌లైన్ కోర్సులు ఫ్రీ
Published by: Santhosh Kumar S
First published: May 11, 2020, 1:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading