Education Loan: విద్యార్థులకు గుడ్ న్యూస్... ఐసీఐసీఐ నుంచి రూ.1 కోటి వరకు లోన్

ICICI Bank Insta Education loan | ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు శుభవార్త. ఐసీఐసీఐ బ్యాంకు రూ.1 కోటి వరకు ఎడ్యుకేషన్ లోన్ అందిస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: June 23, 2020, 2:42 PM IST
Education Loan: విద్యార్థులకు గుడ్ న్యూస్... ఐసీఐసీఐ నుంచి రూ.1 కోటి వరకు లోన్
Education Loan: విద్యార్థులకు గుడ్ న్యూస్... ఐసీఐసీఐ నుంచి రూ.1 కోటి వరకు లోన్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
విద్యార్థులకు శుభవార్త. ఐసీఐసీఐ బ్యాంక్ రూ.1 కోటివరకు ఎడ్యుకేషన్ లోన్ అందిస్తోంది. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునేవారికి ఈ లోన్ ఎంతగానో ఉపయోగపడనుంది. లోన్ జారీ చేసే ప్రక్రియనూ సులభతరం చేసింది. 'ఇన్‌స్టా ఎడ్యుకేషన్ లోన్' పేరుతో విద్యా రుణాలను అందిస్తోంది. ఆసక్తిగలవారు తమతో పాటు తమ పిల్లలు, తోబుట్టువుల చదువుకోసం ఈ లోన్ తీసుకోవచ్చు. ఇప్పటికే లక్షలాది మంది కస్టమర్లకు ప్రీ-అప్రూవ్డ్ ఎడ్యుకేషన్ లోన్స్ ఆఫర్ చేస్తోంది. లోన్ ప్రాసెస్ మొత్తం డిజిటల్ పద్ధతిలోనే చేస్తోంది ఐసీఐసీఐ బ్యాంక్. గతంలో అయితే ఎడ్యుకేషన్ లోన్ సాంక్షన్ లెటర్ పొందడానికి కొన్ని రోజులు పట్టేది. కానీ ఇప్పుడు రూ.1 కోటి వరకు లోన్ సాంక్షన్ లెటర్‌ను వెంటనే ఇస్తోంది. ఈ లెటర్ తీసుకొని వెళ్లి విద్యార్థులు కాలేజీలో అడ్మిషన్లు పొందొచ్చు. ఐసీఐసీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్‌లో కొన్ని క్లిక్స్‌తోనే 'ఇన్‌స్టా ఎడ్యుకేషన్ లోన్'కు అప్లై చేయొచ్చు.


ఐసీఐసీఐ 'ఇన్‌స్టా ఎడ్యుకేషన్ లోన్' తీసుకోవాలనుకునే విద్యార్థులు బ్రాంచ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇమెయిల్ ద్వారా సాంక్షన్ లెటర్ పొందొచ్చు. బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్న కస్టమర్లు తమ పిల్లల కోసం 90% వరకు లోన్ తీసుకోవచ్చు. విదేశాల్లో చదువుకోవాలనుకుంటే విద్యా సంస్థను బట్టి రూ.10 లక్షల నుంచి రూ.1 కోటి వరకు లోన్ తీసుకోవచ్చు. భారతదేశంలో చదువుకోవాలంటే రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు లోన్ వస్తుంది. 10 ఏళ్ల వరకు రీపేమెంట్ టెన్యూర్ సెలెక్ట్ చేయొచ్చు. ఐసీఐసీఐ 'ఇన్‌స్టా ఎడ్యుకేషన్ లోన్'పై 8 ఏళ్ల వరకు చెల్లించే వడ్డీకి ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Govt Jobs: ఇంటర్ పాసయ్యారా? ఈ 669 ఉద్యోగాలకు అప్లై చేయండి

Andhra Pradesh Jobs: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు... ఎగ్జామ్స్ ఎప్పుడంటే

Govt Jobs: టెన్త్ పాసయ్యారా? ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధం కండి
First published: June 23, 2020, 2:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading