హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

ICFAI Business School: రూ.10 కోట్ల విలువైన స్కాలర్‌షిప్స్‌ ప్రకటన .. అర్హత వీళ్లకే..

ICFAI Business School: రూ.10 కోట్ల విలువైన స్కాలర్‌షిప్స్‌ ప్రకటన .. అర్హత వీళ్లకే..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ICFAI Business School: ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌తో పాటు ఆకర్షణీయమైన ప్యాకేజీ ఆఫర్‌లతో జేపీ మోర్గాన్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, కేపీఎంజీ, ఎర్నెస్ట్ అండ్ యంగ్ వంటి టాప్ సంస్థల్లో ICFAI బిజినెస్ స్కూల్ ఉద్యోగవకాశాలను కల్పిస్తుంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

రక్షణ శాఖ సిబ్బంది పిల్లలు, ప్రతిభావంతులు, వికలాంగులకు లబ్ధి చేకూరేలా ICFAI బిజినెస్ స్కూల్(IBS) కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల (Students) కోసం అందించే మొత్తం స్కాలర్‌షిప్‌ (Scholarship) విలువను రూ.10 కోట్ల వరకు పెంచింది. వివిధ కేటగిరీలకు చెందిన ప్రతిభ ఉన్న విద్యార్థులు, రక్షణ శాఖలో పనిచేసే సిబ్బంది పిల్లలకు, IBS పూర్వ విద్యార్థుల పిల్లలకు, దివ్యాంగులకు ఈ స్కాలర్‌షిప్స్ అందజేయనుంది. ICFAI బిజినెస్ స్కూల్‌కు 62000+ పూర్వ విద్యార్థులు ఉన్నారు. వీరు దేశ భద్రతలో భాగమైన రక్షణ సిబ్బంది పిల్లలను స్కాలర్ షిప్ కోసం ఎంపిక చేస్తారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా వికలాంగులకు కూడా స్కాలర్‌షిప్స్ అందజేస్తారు.

* టాపర్స్‌కు మాత్రమే..

2023-25 బ్యాచ్ కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షలో టాపర్లుగా నిలిచిన వారికి మాత్రమే ఈ స్కాలర్‌షిప్స్ మంజూరు చేస్తారు. ఈ ప్రక్రియ ICFAI బిజినెస్ స్కూల్‌లో చేరేలా విద్యార్థులను ప్రోత్సహిస్తుంది. ICFAI బిజినెస్ స్కూల్ నమోదు చేసుకున్న తర్వాత ఫీజు చెల్లింపు సమయంలో స్కాలర్‌షిప్ మొత్తం మొదటి, రెండో సెమిస్టర్‌లలో సర్దుబాటు చేస్తారు. ఇది కూడా కొన్ని నిబంధనలకు లోబడి ఉంటుంది.

* ప్లేస్ మెంట్ కోసం సీఎంసీ ఏర్పాటు

ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌తో పాటు ఆకర్షణీయమైన ప్యాకేజీ ఆఫర్‌లతో జేపీ మోర్గాన్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, కేపీఎంజీ, ఎర్నెస్ట్ అండ్ యంగ్ వంటి టాప్ సంస్థల్లో ICFAI బిజినెస్ స్కూల్ ఉద్యోగవకాశాలను కల్పిస్తుంది. ప్రతి సంవత్సరం బెస్ట్ ప్లేస్‌మెంట్స్ కోసం విద్యార్థులను సిద్ధం చేయడానికి కెరీర్ మేనేజ్‌మెంట్ సెంటర్(CMC)ను ఏర్పాటు చేసింది . గత సంవత్సరం ICFAI బిజినెస్ స్కూల్ ఫ్లేస్‌మెంట్ ప్రక్రియలో 500 కంటే ఎక్కువ కంపెనీలు పాల్గొన్నాయి.

* సమ్మర్ ఇంటర్న్‌షిప్

ICFAI బిజినెస్ స్కూల్ 14 వారాల పాటు సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులకు ఇండస్ట్రీ ఇంటర్‌ఫేస్‌ అవకాశాన్ని అందిస్తుంది. ప్రధానంగా డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోకో కోలా వంటి సంస్థలు ఇంటర్న్‌షిప్ రిక్రూటర్‌లుగా ఉన్నాయి. సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ మొదటి సంవత్సరంలో విద్యార్థులకు కార్పొరేట్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి సహాయపడుతుంది.

ఇది కూడా చదవండి : విద్యార్ధుల కోసం రామకృష్ణ మిషన్ కీలక నిర్ణయం.. ఆ ప్రోగ్రామ్ తో అన్ని విభాగాల్లోనూ శిక్షణ..

ICFAI బిజినెస్ స్కూల్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ నుంచి విలువను సృష్టించడానికి ప్రయత్నిస్తుంది. ఇది వ్యక్తిత్వ వికాసానికి, వివిధ కంపెనీలతో కలిసి పనిచేయడం, కార్పొరేట్ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో విద్యార్థులకు సహాయపడుతుంది. బ్యాంకింగ్, కన్సల్టింగ్, ఇ-కామర్స్, విద్య , ఆర్థిక సేవలు, బీమా, టెలికాం, ఐటీ మీడియా అండ్ రీసెర్చ్, మీడియా అండ్ టూరిజం తదితర రంగాల్లో ప్లేస్‌మెంట్ ఆఫర్‌ను విద్యార్థులకు అందిస్తుంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, EDUCATION, JOBS, Scholarships