ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) ఆల్ ఇండియా కెరీర్ కౌన్సెలింగ్(Career Counselling) ప్రోగ్రామ్ను రేపు అనగా.. అక్టోబర్ 31న నిర్వహించనుంది. ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియం (KD జాదవ్ కాంప్లెక్స్)లో ఆఫ్లైన్ విధానంలో కార్యక్రమం నిర్వహించబడుతుంది. ICAI పత్రికా ప్రకటన ప్రకారం.. ఈ ఈవెంట్ యొక్క లక్ష్యం 9వ తరగతి నుండి గ్రాడ్యుయేషన్ వరకు విద్యార్థులకు కెరీర్ గైడెన్స్(Career Guidance) అందించడం, తద్వారా వారు వారి భవిష్యత్తు కోసం ఉత్తమ నిర్ణయాలు తీసుకునే విధంగా చేయడం. ఈ కెరీర్ కౌన్సెలింగ్ ద్వారా విద్యార్థుల ఆలోచనా విధానంలో మార్పులు రానున్నాయి. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొంటారు.
ఈ కార్యక్రమంలో దాదాపు 5000 మంది విద్యార్థులు ప్రత్యక్షంగా పాల్గొంటారని.. అంత కాకుండా.. వివిధ పాఠశాలలు/కళాశాలల నుండి దాదాపు 1.50 లక్షల మంది విద్యార్థులు వివిధ ప్రదేశాలలో ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ICAI అంచనా వేస్తోంది. అన్ని ప్రభుత్వ మరియు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులు ఈ కార్యక్రమానికి ఆన్ లైన్ విధానంలో పేర్లను నమోదు చేసుకోవచ్చు. దీని కోసం వారు icai.org లో దరఖాస్తు చేసుకోవచ్చు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యూఢిల్లీ డైరెక్టర్ ఎడ్యుకేషన్ (DOE), IAS, హిమాన్షు గుప్తా పాల్గొననున్నారు. అంతే కాకుండా.. ICAI ప్రెసిడెంట్ దేబాశిష్ మిత్రా కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు.
దేశంలో చార్టర్డ్ అకౌంటెన్సీ వృత్తిని స్థిరీకరించేందుకు చార్టర్డ్ అకౌంటెంట్స్ చట్టం, 1949 ద్వారా ICAI స్థాపించబడింది. ICAI వెబ్సైట్ ప్రకారం ఈ సంస్థ భారత ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కిందద పని చేస్తుంది. ఈ సంస్థ CA ఫౌండేషన్ మరియు ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం పరీక్షలు నవంబర్ 1 నుండి నిర్వహించబడతాయి.
అంతకుముందు మే 1న, వెస్ట్రన్ ఇండియా రీజినల్ కౌన్సిల్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) అహ్మదాబాద్ బ్రాంచ్ హైస్కూల్ పాస్ అవుట్ విద్యార్థుల కోసం ఉచిత కెరీర్ కౌన్సెలింగ్ సెమినార్ను నిర్వహించింది. ఈ సందర్భంగా ఐసీఏఐ అహ్మదాబాద్ శాఖ అధ్యక్షుడు సీఏ బిషన్ షా మాట్లాడుతూ 12వ తరగతి నుంచి ఉత్తీర్ణత సాధించడం ప్రతి విద్యార్థి జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని అన్నారు. విద్యార్థులు తమ కెరీర్ను ఏ రంగంలో ఎంచుకోవాలో నిర్ణయించుకోవాల్సిన సమయం కూడా ఇదేనని అన్నారు. దీని తర్వాత కెరీర్ లో ఎంచుకొనే ప్రతీ విషయం ముఖ్యమైనదన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Counselling, Degree students, JOBS