హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

ICAI CA May Exam: ఐసీఏఐ CA మే సెషన్​ పరీక్షల రిజిస్ట్రేషన్​ ప్రక్రియ ప్రారంభం.. ఆన్​లైన్​లో ఇలా దరఖాస్తు చేసుకోండి..

ICAI CA May Exam: ఐసీఏఐ CA మే సెషన్​ పరీక్షల రిజిస్ట్రేషన్​ ప్రక్రియ ప్రారంభం.. ఆన్​లైన్​లో ఇలా దరఖాస్తు చేసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) సీఏ ఇంటర్మీడియట్, ఫౌండేషన్, ఫైనల్ పరీక్షలు లేదా మే సెషన్ పరీక్షల​ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 13 లోపు ఐసీఏఐ అధికారిక వెబ్‌సైట్ www.icai.org ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇంకా చదవండి ...

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) సీఏ ఇంటర్మీడియట్, ఫౌండేషన్, ఫైనల్ పరీక్షలు లేదా మే సెషన్ పరీక్షల​ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 13 లోపు ఐసీఏఐ అధికారిక వెబ్‌సైట్ www.icai.org ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు వారి పేరు, పుట్టిన తేదీ, ఈ–మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌ను ఉపయోగించి రిజిస్ట్రేషన్​(Registration) చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్షల కోసం రిజిస్ట్రేషన్​ గడువు మార్చి 13తో ముగియనుండగా.. ఆలస్య రుసుముతో మార్చి 20 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. కాగా, చార్డర్డ్​ అకౌంటెంట్స్ (సీఏ) ఫౌండేషన్​ పరీక్షai ఈ ఏడాది మే 23న ప్రారంభమై, మే 29న ముగుస్తాయి.

గ్రూప్​1 ఇంటర్మీడియట్ కోర్సు పరీక్షను మే 15 నుంచి మే 22 మధ్య నిర్వహిస్తారు. గ్రూప్ 2 ఇంటర్మీడియట్​ కోర్సు పరీక్ష మే 24 నుంచి మే 30 వరకు జరుగుతుంది. సీఏ ఫైనల్​ కోర్స్​ గ్రూప్ 1 పరీక్షల మే 14 నుండి మే 21 వరకు, సీఏ ఫైనల్​ గ్రూప్ 2 పరీక్షల మే 23 నుంచి మే 29 మధ్య నిర్వహిస్తారు. ఇంటర్నేషనల్​ ట్యాక్సేషన్ అసెస్​మెంట్ పరీక్షల మే 14 నుంచి మే 17 వరకు జరగనుంది. ఈ మేరకు ఐసీఏఐ తాజా షెడ్యూల్​ను​ విడుదల చేసింది.

Online Degree Courses: ఆన్‌లైన్‌ డిగ్రీ కోర్సులను యూజీసీ సిద్ధం.. దేశవ్యాప్తంగా 900 కళాశాలల్లో అందుబాటులోకి..!


ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

ముందుగా ICAI అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్ చేయండి.

హోమ్‌పేజీలో, రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.

వెంటనే అప్లికేషన్​ ఓపెన్​ అవుతుంది. లాగిన్​ అవ్వడానికి అవసరమైన అన్ని వివరాలను ఫిల్ చేయండి.

ఆ తర్వాత వివరాలను సరిచూసుకొని దరఖాస్తు ఫారమ్‌ను సబ్​మిట్​ చేయండి.

దరఖాస్తు రుసుము చెల్లించండి.

పూరించిన దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ అవుట్ తీసుకోండి.

ఇదిలా ఉండగా, ICAI CA ఇంటర్మీడియట్ పరీక్షకు సంబంధించిన పాత, కొత్త కోర్సుల ఫలితాలు ఫిబ్రవరి 26న విడుదల కానున్నాయి. www. icai.org, icaiexam.icai.org లేదా caresults.icai.org వెబ్​సైట్ల ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు. ఐసీఏఐ సీఏ ఇంటర్మీడియట్​ ఫలితాలు.. సీఏ ఫౌండేషన్, తుది ఫలితాలు వెల్లడైన 10 నుంచి -12 రోజుల తర్వాత విడుదల కానున్నాయి. సీఏ కోర్సు పాత స్కీమ్ నుండి కొత్త స్కీమ్‌కి మారడానికి ఏసీఏఐ చివరి తేదీని కూడా పొడిగించింది. మార్చి 13 వరకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు www.eservices.icai.orgలో చివరి తేదీలోపు కొత్త స్కీమ్‌కి మారాల్సి ఉంటుంది.

First published:

Tags: Ca exams, Career and Courses, Exams, Icai

ఉత్తమ కథలు