Home /News /jobs /

ICAI CA INTER 2021 RESULT FOR JULY SESSION DECLARED EVK

ICAI CA Inter Results: ఐసీఏఐ సీఏ ఇంట‌ర్‌ ఫ‌లితాలు విడుద‌ల‌

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ( Institute of Chartered Accountants of India) చార్టర్డ్ అకౌంటెంట్ (CA) ఇంటర్ ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షలో ముంబైకి చెందిన ప్రీతి నందన్ కామత్ 388/700 స్కోర్ సాధించి టాప్ ర్యాంక్ సాధించింది.

ఇంకా చదవండి ...
    ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ( Institute of Chartered Accountants of India) చార్టర్డ్ అకౌంటెంట్ (CA) ఇంటర్ ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షలో ముంబైకి చెందిన ప్రీతి నందన్ కామత్ 388/700 స్కోర్ సాధించి టాప్ ర్యాంక్ సాధించింది. ఫలితాలకు సంబంధించిన వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లు icai.nic.in, caresults.icai.org మరియు icaiexam.icai.org ల‌ను సంద‌ర్శించాలి. ఈ ప‌రీక్ష జూలై 2021 లో జరిగింది. చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇంటర్మీడియట్ పరీక్ష (పాత కోర్సు & కొత్త కోర్సు) ఫలితాలు సెప్టెంబ‌ర్ 19, 2021న ప్ర‌టించిన‌ట్టు ఐసీఏఐ  (ICAI )తన అధికారిక వెబ్‌సైట్‌లో రాసింది. ఎవ‌రైన అభ్య‌ర్థులు ఫ‌లితాల‌ను మెయిల్ ద్వారా అందుకోవాల‌నుకొంటే icaiexam.icai.org లో న‌మోదు చేసుకోవాల‌ని ICAI సూచించింది. ఎవ‌రైతే ఈ-మెయిల్ (e-Mail) రిజిస్ట‌ర్ చేసుకొంటారో వారికి ఫ‌లితాల‌ను ICAI పంప‌నుంది. ఇది విద్యార్థుల‌కు ఉప‌యుక్తంగా ఉంటుంద‌ని ఐసీఏఐ పేర్కొంది.

    ఫ‌లితాలు చూసుకొనే విధానం..
    Step 1: ముందుగా ICAI అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
    Step 2: హోమ్‌పేజీలోని 'announcements' విండోపై క్లిక్ చేయండి
    Step 3: అనంత‌రం కొత్త విండో తెరుచుకొంటుంది. అక్క‌డ మీ కోర్సు యొక్క సంబంధిత ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి.

    CBSC Exams: అక్టోబర్‌లో సీబీఎస్ఈ టర్మ్-1 పరీక్షలు!


    Step 4: మీరోల్ నంబర్‌తో పాటు మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా పిన్ నంబర్‌ (Pin Number) ను నమోదు చేయాలి
    Step 5: మీ ఫ‌లితాలు డిస్‌ప్లే (Display) అవుతుంది. అనంత‌రం వాట‌ని ప్రింట్ తీసుకోవ‌చ్చు.

    ఫ‌లితాలు చూసుకొన్న త‌రువాత అభ్య‌ర్థులు ముందుగా త‌మ పేరు, కోర్సు వివ‌రాలు స‌రి చూసుకోవాలి. ఏమైన త‌ప్పు ఉంటే సంబంధిత అధికారుల‌కు ఫిర్యాదు చేయాలి. ఒక ప్రింట్ కాపీని భ‌విష్య‌త్ అవ‌స‌రాల కోసం భ‌ద్ర‌ప‌రుచుకోవాలి.
    CAI డిసెంబర్ 2021 పరీక్ష కోసం ICAI నమోదు ప్రక్రియను ప్రారంభించింది. ఈ ద‌ర‌ఖాస్తుల‌కు ఆఖ‌రు తేదీ సెప్టెంబ‌ర్ 30, 2021. ఒక‌వేళ ఆ లోపు చెల్లించ‌లేని వారు అక్టోబ‌ర్ 3, 2021 వ‌ర‌కు ఆల‌స్య రుసుముతో ఫీజు చెల్లించ‌వ‌చ్చు. త‌దుప‌రి ICAI CA ఫౌండేషన్, ఇంటర్మీడియట్ పరీక్ష డిసెంబర్ 5 న ప్రారంభమై డిసెంబర్ 20 న ముగుస్తుంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: CAREER, EDUCATION, Results, Study

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు