హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CA Foundation: ఫిబ్రవరి మొదటి వారంలో సీఏ ఫౌండేషన్ రిజల్ట్స్.. లేటెస్ట్ అప్‌డేట్స్ ఇవే..

CA Foundation: ఫిబ్రవరి మొదటి వారంలో సీఏ ఫౌండేషన్ రిజల్ట్స్.. లేటెస్ట్ అప్‌డేట్స్ ఇవే..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

సీఏ ఫౌండేషన్ నవంబర్-2022 ఎడిషన్ పరీక్షలను డిసెంబర్ 14 నుంచి 20 మధ్య నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితాలను జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ప్రకటించే అవకాశం ఉందని ఐసీఏఐ వర్గాలు వెల్లడించాయి.  

  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

కామర్స్(Commerce) రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి CA, CS, ICWAI వంటి ప్రొఫెషనల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులను క్లియర్ చేసిన వారికి అద్భుతమైన ఉద్యోగవకాశాలు ఉన్నాయి. సీఏ(చార్టెడ్ అకౌంటెన్సీ)కి సంబంధించిన అన్ని పరీక్షలను ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెన్స్ ఆఫ్ ఇండియా (ICAI) నిర్వహిస్తుంది. సీఏ ఫౌండేషన్ నవంబర్-2022 ఎడిషన్ పరీక్షలను ఈ ఇన్‌స్టిట్యూట్ డిసెంబర్ 14 నుంచి 20 మధ్య చేపట్టింది. ఈ పరీక్షల ఫలితాలను జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ప్రకటించే అవకాశం ఉందని ఐసీఏఐ వర్గాలు వెల్లడించాయి.

Non Teaching Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. MNNITలో 103 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ..

CA ఫౌండేషన్ పరీక్షను నాలుగు సెషన్స్‌లో నాలుగు పేపర్లుగా నిర్వహించారు. ఈ ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఐసీఏఐ అధికారిక వెబ్‌సైట్స్ icai.org లేదా icai.nic.inలలో అందుబాటులో ఉంటాయి. ఫలితాలతో పాటు టాపర్స్ జాబితా, ఉత్తీర్ణత శాతాన్ని కూడా ICAI ప్రకటిస్తుంది.

ఫలితాల డౌన్‌లోడ్ ప్రాసెస్

ముందుగా అభ్యర్థులు ఐసీఏఐ అధికారిక వెబ్‌సైట్ icai.org or icai.nic.inను విజిట్ చేయాలి. హోమ్ పేజీలోకి వెళ్లి ‘సీఏ ఫౌండేషన్ రిజల్ట్ డిసెంబర్ 2022 డౌన్‌లోడ్’ అనే లింక్‌పై క్లిక్ చేయాలి.

ఆ తరువాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ రోల్ నంబర్, పిన్ నంబర్ లేదా రిజిస్టర్ నంబర్ సహాయంతో లాగిన్ అవ్వాలి.

దీంతో ఐసీఏఐ సీఏ ఫౌండేషన్ డిసెంబర్ 2022 మీ ఫలితాలు స్క్రీమ్ మీద డిస్‌ప్లే అవుతాయి. భవిష్యత్ అవసరాల కోసం ఫలితాలను సేవ్ చేసుకోండి.

ఫైనల్ ఫలితాల తరువాత మార్క్‌షీట్

అభ్యర్థులకు వారి రిజిస్టర్డ్ ఇమెయిల్ ID ద్వారా కూడా ఐసీఏఐ CA ఫలితాలను తెలియజేస్తుంది. CA ఫైనల్ ఫలితాల ప్రకటన తర్వాత మార్క్‌షీట్స్ విద్యార్థులకు అందజేయనున్నారు. సీఏ ఫౌండేషన్ డిసెంబర్ 2022 పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 2022 సెప్టెంబర్ 7గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. లేట్ ఫీజుతో సెప్టెంబర్ 10 వరకు అవకాశం కల్పించింది. కాగా, సీఏ ఫౌండేషన్ పరీక్షలను డిసెంబర్ 14 నుంచి 20 మధ్య నిర్వహించింది. ఫలితాలు ఈ నెల చివరికల్లా వెల్లడికానున్నాయి.

గతేడాది నంబర్‌లో జరిగిన సీఏ ఫైనల్, ఇంటర్మీడియట్ ఫరీక్షల ఫలితాలు ఇటీవల వెల్లడైన సంగతి తెలిసిందే. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెన్స్ ఆఫ్ ఇండియా(ICAI) ఈ పరీక్ష ఫలితాలను జనవరి 10న విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్స్ icai.org లేదా icai.nic.in ద్వారా రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. స్కోర్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవచ్చు.

First published:

Tags: Ca results, Career and Courses, Foundation course, JOBS

ఉత్తమ కథలు