హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

ICAI CA Exam 2020: ఆ పరీక్ష తేదీల్లో ఎలాంటి మార్పు లేదు.. ఆ ప్రకటన పూర్తిగా ఫేక్..

ICAI CA Exam 2020: ఆ పరీక్ష తేదీల్లో ఎలాంటి మార్పు లేదు.. ఆ ప్రకటన పూర్తిగా ఫేక్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ICAI CA Exam 2020: సీఏ పరీక్షల విషయంలో కొందరు తప్పుడు వార్తను సృష్టించారు. పరీక్ష తేదీల్లో మార్పులు అంటూ ఓ తప్పుడు ప్రకటన కాపీని సైతం తయారు చేసి సోషల్ మీడియాలో ఉంచారు.

సోషల్ మీడియా ట్రెండ్ ప్రారంభమైన నాటి నుంచి తప్పుడు వార్తలు సైతం పెరుగుతున్నాయి. కొందరు కావాలని అసత్యపు వార్తలను సృష్టించి ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారు. ఎక్కడో జరిగిన విషయాలను ఇక్కడ జరిగాయన్నట్లు చెబుతూ ఆందోళనకు గురి చేస్తున్నారు. తాజాగా సీఏ పరీక్షల విషయంలో ఇలాంటి తప్పుడు వార్తను కొందరు తయారు చేశారు. పరీక్ష తేదీల్లో మార్పులు అంటూ ఓ తప్పుడు ప్రకటన కాపీని సైతం సృష్టించి సోషల్ మీడియాలో ఉంచారు. దీంతో అభ్యర్థులు అది నిజమనే నమ్మే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం ఇనిస్ట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ICAI) దృష్టికి వెళ్లింది. దీంతో సంస్థ సీఏ ఎగ్జామ్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కీలక సూచన చేసింది. పరీక్ష తేదీలను మార్చినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తమని స్పష్టం చేసింది.

అభ్యర్థులంతా ఈ విషయాన్ని గమనించాలని సూచించింది. వివిధ సోషల్ మీడియా వేధికల్లో సీఏ పరీక్ష తేదీలు వాయిదా పడ్డాయంటూ తప్పుడు పోస్టులు వస్తున్న క్రమంలో ICAI ఈ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు సంస్థ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ప్రకటన విడుదల చేసింది. సోషల్ మీడియాలో సీఏ పరీక్షలపై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.

కొత్త షెడ్యూల్ వచ్చిందన్న వార్త పూర్తిగా అవాస్తవమని ICAI స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నెల 13న ప్రకటించిన పరీక్షల తేదీల్లో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది. కాగా.. ICAI CA పరీక్షలు నవంబర్ 21 నుంచి డిసెంబర్ 14 వరకు నిర్వహించనున్నారు.

First published:

Tags: Exams, Fake news, Social Media

ఉత్తమ కథలు