IBS ROLLS OUT ONLINE COURSE IN PRODUCT MANAGEMENT GH VB
ISB Course: ఆన్లైన్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ కోర్సును లాంచ్ చేసిన ఐఎస్బీ.. ప్రోగ్రామ్ ప్రత్యేకతలివే..
ప్రతీకాత్మక చిత్రం
వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం సరికొత్త ఆన్లైన్ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చింది ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB). ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ప్రొడక్ట్ మేనేజ్మెంట్ విభాగంలో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని సంస్థ తెలిపింది.
వర్కింగ్ ప్రొఫెషనల్స్(Working Professionals) కోసం సరికొత్త ఆన్లైన్ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చింది ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB). ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ప్రొడక్ట్ మేనేజ్మెంట్ విభాగంలో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని సంస్థ తెలిపింది. గ్లోబల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ సంస్థ ఎరుడిటస్ (Eruditus)తో కలిసి మూడో విడత ప్రొడక్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ (Product management programme)ను ISB ప్రకటించింది. 2022 ఫిబ్రవరి 14న కోర్సు మొదలవుతుందని పేర్కొంది. మూడు నెలల వ్యవధి ఉండే ఈ కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన వారికి కంప్లీషన్ సర్టిఫికెట్ అందజేస్తారు. దీంతోపాటు సంస్థ ఎగ్జిక్యూటివ్ నెట్వర్క్ లో కూడా చోటు దక్కుతుంది. కోర్సుపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్సైట్ online-er.isb.edu లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు.
దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనలో.. ఈ ప్రోగ్రామ్ లో చేరాలనుకునే వారికి ఏదైనా రంగంలో 6-15 సంవత్సరాల అనుభవం ఉంటే సరిపోతుందని ఐఎస్బీ తెలిపింది. అయితే ప్రొడక్ట్ మేనేజ్మెంట్ కోర్సులు చదివి ఉండాల్సిన అవసరం లేదని చెప్పింది. మార్కెటింగ్, ఫైనాన్స్, సేల్స్ డిపార్ట్మెంట్ నుంచి మారాలనుకునే సీనియర్లకు ఈ కోర్సు ఉపయోగపడనుంది.
ఈ కోర్సు లాంచింగ్ సందర్భంగా ఎరుడిటస్ సీఈవో మోహన్ కన్నెగల్ మాట్లాడుతూ.. ‘ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ ఆలోచన నుంచి మొదలైన ప్రయాణం ప్లానింగ్, డెవలప్మెంట్, ఎగ్జిక్యూషన్ స్థాయిలను దాటి తుది దశకు చేరుకుంటేనే ప్రొడక్ట్ సిద్దమవుతుంది. కీలకమైన ఈ దశల్లో తప్పులకు తావు ఇవ్వకూడదు. ప్రొడక్ట్ సిద్ధమయ్యాక కూడా ప్రొడక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్ చాలా అవసరం. వినియోగదారుల అభిరుచుల మేరకు 360 డిగ్రీలలో ప్రొడక్ట్ ను రూపొందించగల అవకాశం ఇండియాలో ఉంది. ఈ కోర్సు ద్వారా అభ్యర్థులకు ప్రస్తుత ఇండస్ట్రీ అవసరాలకు తగినట్టు పనిచేసే నైపుణ్యం లభిస్తుంది. బిజినెస్ అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ప్రొఫెషనల్స్ మెరుగవుతారు’ అని చెప్పారు.
ఐఎస్బీ మాజీ డీన్, ప్రొఫెసర్ డా.రాజేంద్రన్ శ్రీవాస్తవ, అసోసియేట్ ప్రొఫెసర్ మనీష్ గంగ్వార్, అసోసియేట్ ప్రొఫెసర్ సిద్ధార్థ్ ఎస్.సింగ్ కోర్సు టీచింగ్ సిబ్బందిగా వ్యవహరించనున్నారు. 2020 నవంబర్ లో ఈ కోర్సును పరిచయం చేసినప్పటి నుంచి రెండు బ్యాచుల్లో 450 మంది పాల్గొన్నారు. ఐఎస్బీ కొత్త ఆలోచనతో మార్కెట్ లోకి నైపుణ్యం ఉన్న ఉద్యోగులు అడుగు పెడుతున్నారు. కోర్సు పూర్తి చేసిన తర్వాత విరివిగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, ఐఎస్బీ నెట్వర్క్లో స్థానం దక్కుతుందని నిర్వాహకులు చెప్పారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.