IBPS SO RECRUITMENT 2021 INSTITUTE OF BANKING PERSONNEL SELECTION INVITES APPLICATIONS FOR 1828 SPECIALITY OFFICER POSTS SS
IBPS Recruitment 2021: ప్రభుత్వ బ్యాంకుల్లో 1828 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
IBPS Recruitment 2021: ప్రభుత్వ బ్యాంకుల్లో 1828 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)
IBPS SO Recruitment 2021 | ప్రభుత్వ బ్యాంకుల్లో ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1828 పోస్టుల్ని భర్తీ చేస్తోంది.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (IBPS) ఉద్యోగాల భర్తీకి మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. పలు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 1828 ఖాళీలున్నాయి. ఐటీ ఆఫీసర్, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్, రాజ్‌భాషా అధికారి, లా ఆఫీసర్, హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అప్లై చేయడానికి 2021 నవంబర్ 23 చివరి తేదీ. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనెరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ పోస్టులున్నాయి.
IBPS SO Recruitment 2021: ఖాళీలు, విద్యార్హతల వివరాలు ఇవే
మొత్తం ఖాళీలు
1,828
విద్యార్హతలు
ఐటీ ఆఫీసర్
220
కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ క్మయూనికేషన్స, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో 4 ఏళ్ల ఇంజనీరింగ్, టెక్నాలజీ డిగ్రీ పాస్ కావాలి. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ పాస్ కావాలి.
అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్
884
అగ్రికల్చరల్, హార్టికల్చర్, యానిమల్ హజ్బెండరీ, వెటర్నరీ సైన్స్, డైరీ సైన్స్, ఫిషరీ సైన్స్, పిస్కికల్చర్, అగ్రి మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, కోఆపరేషన్ అండ్ బ్యాంకింగ్, ఆగ్రో ఫారెస్ట్రీ, ఫారెస్ట్రీ అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ, ఫుడ్ సైన్స్, అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్‌మెంట్, ఫుడ్ టెక్నాలజీ, డైరీ టెక్నాలజీ, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ సెరికల్చర్‌లో 4 ఏళ్ల డిగ్రీ పాస్ కావాలి.
రాజ్‌భాషా అధికారి
84
హిందీ, సంస్కృతంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పాస్ కావాలి.
లా ఆఫీసర్
44
న్యాయ శాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ కావాలి. బార్ కౌన్సిల్‌లో అడ్వకేట్‌గా ఎన్‌రోల్ కావాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.