ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా? బ్యాంకింగ్ రంగంలో జాబ్ మీ కలా? ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (IBPS) స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల భర్తీకి లేటెస్ట్గా మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఐబీపీఎస్ 4,135 ప్రొబెషనరీ ఆఫీసర్, మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది ఐబీపీఎస్. స్పెషలిస్ట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1828 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఈ నోటిఫికేషన్ ద్వారా ఐటీ ఆఫీసర్, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్, రాజ్‌భాషా అధికారి, లా ఆఫీసర్, హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఐబీపీఎస్. ఆసక్తి గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 2021 నవంబర్ 23 లోగా దరఖాస్తు చేయాలి.
AP High Court Jobs: ఏపీ హైకోర్టులో లా క్లర్క్ ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనెరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉన్న పోస్టులు ఇవి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి. మరి ఈ పోస్టులకు ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.
TCS Jobs: ఆ కోర్సు పాస్ అయినవారికి టీసీఎస్‌లో ఉద్యోగాలు... దరఖాస్తు గడువు పెంపు
Step 1- అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్సైట్ స్పెషలిస్ట్ ఆఫీసర్ లింక్ https://www.ibps.in/crp-specialist-officers-xi/ ఓపెన్ చేయాలి.
Step 2- ఈ లింక్‌లో డీటెయిల్డ్ నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్ ఉంటాయి.
Step 3- Click here to apply Online for Common Recruitment Process for (CRP SPL- XI) లింక్ పైన క్లిక్ చేయాలి.
Step 4- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Click here for New Registration పైన క్లిక్ చేయాలి.
Step 5- ముందే రిజిస్ట్రేషన్ చేసిన అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయడానికి లాగిన్ చేయాలి.
Step 6- లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ ఆరు దశల్లో ఉంటుంది.
Step 7- మొదటి దశలో పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలన్నీ ఎంటర్ చేయాలి.
Step 8- రెండో స్టేజ్‌లో ఫోటో, సంతకం అప్లోడ్ చేయాలి.
Step 9- మూడో దశలో ఇతర వివరాలన్నీ ఎంటర్ చేయాలి.
Step 10- నాలుగో దశలో అప్లికేషన్ వివరాలన్నీ సరిచూసుకోవాలి.
Step 11- ఐదో దశలో ఎడమ చేతి వేలి ముద్ర, చేతితో రాసిన డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి.
Step 12- ఆరో దశలో దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank Jobs, CAREER, Central Government Jobs, Govt Jobs 2021, IBPS, Job notification, JOBS