హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IBPS Recruitment 2021: ప్రభుత్వ బ్యాంకుల్లో 1828 జాబ్స్... ఏం చదవాలంటే

IBPS Recruitment 2021: ప్రభుత్వ బ్యాంకుల్లో 1828 జాబ్స్... ఏం చదవాలంటే

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

IBPS SO Recruitment 2021 | ప్రభుత్వ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి (Bank Jobs) దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పోస్టులకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (IBPS) ఎలా ఎంపిక చేస్తుందో, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలుసుకోండి.

ఇంకా చదవండి ...

    ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (IBPS) ప్రభుత్వరంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) ద్వారా 1828 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఐటీ ఆఫీసర్, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్, రాజ్‌భాషా అధికారి, లా ఆఫీసర్, హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ లాంటి పోస్టులున్నాయి. నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు విధానం గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. అభ్యర్థులు 2021 నవంబర్ 23 లోగా దరఖాస్తు చేయాలి. ఇక ఈ పోస్టులకు ఎలా ఎంపిక చేస్తారు? పరీక్షా విధానం ఎలా ఉంటుంది? ఏఏ అంశాలకు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి? తెలుసుకోండి.

    UPSC Recruitment 2021: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... రూ.2,18,000 వరకు వేతనం

    ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేయనుంది ఐబీపీఎస్. వేర్వేరు పోస్టులకు ఎగ్జామ్ ప్యాటర్న్ వేర్వేరుగా ఉంటుంది. లా ఆఫీసర్, రాజభాషా అధికారి పోస్టుకు ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో 125 మార్కులకు 150 ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో 50 ప్రశ్నలకు 25 మార్కులు, రీజనింగ్‌లో 50 ప్రశ్నలకు 50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ విత్ స్పెషల్ స్పెషల్ రిఫరెన్స్ టు బ్యాంకింగ్ ఇండస్ట్రీకి సంబంధించి 50 ప్రశ్నలకు 50 మార్కులు ఉంటాయి. ప్రతీ సెక్షన్ 40 నిమిషాల చొప్పున 120 నిమిషాలు అంటే రెండు గంటలు ఎగ్జామ్ ఉంటుంది.

    Post Office Jobs: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగానికి అప్లై చేశారా? అయితే వెంటనే ఇలా చేయండి

    ఇక ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టులకు 125 మార్కులకు 150 ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో 50 ప్రశ్నలకు 25 మార్కులు, రీజనింగ్‌లో 50 ప్రశ్నలకు 50 మార్కులు, క్వాంటిటేటీవ్ యాప్టిట్యూడ్‌లో 50 ప్రశ్నలకు 50 మార్కులు ఉంటాయి. ప్రతీ సెక్షన్ 40 నిమిషాల చొప్పున 120 నిమిషాలు అంటే రెండు గంటలు ఎగ్జామ్ ఉంటుంది.

    మెయిన్ ఎగ్జామినేషన్ వివరాలు చూస్తే లా ఆఫీసర్, ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టులకు ప్రొఫెషనల్ నాలెడ్జ్‌లో 60 ప్రశ్నలకు 60 మార్కులు ఉంటాయి. సమయం 45 నిమిషాలు. రాజ్‌భాషా అధికారి పోస్టుకు ప్రొఫెషనల్ నాలెడ్జ్‌లో ఆబ్జెక్టీవ్ 45 ప్రశ్నలు, డిస్క్రిప్టీవ్ 2 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 60 మార్కులు. సమయం 60 నిమిషాలు.

    APPSC Recruitment 2021: ఆంధ్రప్రదేశ్‌లో 38 నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

    బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనెరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల్లో ఖాళీల భర్తీకి ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. 2021 డిసెంబర్ 12న ప్రిలిమినరీ ఎగ్జామ్, 2022 జనవరి 30న మెయిన్ ఎగ్జామ్, 2022 ఫిబ్రవరి లేదా మార్చిలో ఇంటర్వ్యూలు ఉంటాయి. ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అయినవారికి మెయిన్ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయినవారికి ఇంటర్వ్యూ ఉంటాయి. 2022 ఏప్రిల్‌లో ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఉంటుంది.

    ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Bank Jobs, CAREER, Central Government Jobs, Govt Jobs 2021, Job notification, JOBS

    ఉత్తమ కథలు