IBPS SO 2019: బ్యాంకుల్లో 1163 స్పెషలిస్ట్ ఆఫీసర్ జాబ్స్... డిగ్రీ పాసైతే చాలు

IBPS Specialist Officer Recruitment 2019 | దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 6న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు నవంబర్ 26 చివరి తేదీ. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది ఐబీపీఎస్.

news18-telugu
Updated: November 24, 2019, 10:48 AM IST
IBPS SO 2019: బ్యాంకుల్లో 1163 స్పెషలిస్ట్ ఆఫీసర్ జాబ్స్... డిగ్రీ పాసైతే చాలు
IBPS SO 2019: బ్యాంకుల్లో 1163 స్పెషలిస్ట్ ఆఫీసర్ జాబ్స్... డిగ్రీ పాసైతే చాలు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
బ్యాంకులో ఉద్యోగం చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్-IBPS దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. మొత్తం 1163 ఖాళీలను ప్రకటించింది. ఐటీ ఆఫీసర్, లా ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఎంపికైనవారికి అలాహాబాద్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనెరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పోస్టింగ్ లభిస్తుంది. దరఖాస్తుకు నవంబర్ 26 చివరి తేదీ. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది ఐబీపీఎస్.

IBPS Specialist Officer Recruitment 2019: ఖాళీల వివరాలివే...


మొత్తం ఖాళీలు- 1163

ఐటీ ఆఫీసర్ (స్కేల్-1) - 76
అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ (స్కేల్-1)- 670
రాజ్‌భాష అధికారి (స్కేల్-1)- 27


లా ఆఫీసర్ (స్కేల్-1)- 60హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్ (స్కేల్-1)- 20
మార్కెటింగ్ ఆఫీసర్ (స్కేల్-1)- 310

IBPS Specialist Officer Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలివే...


ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం- 2019 నవంబర్ 6
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 26
అప్లికేషన్ ఫీజు చెల్లింపు- 2019 నవంబర్ 6 నుంచి 2019 నవంబర్ 26
ప్రిలిమినరీ కాల్ లెటర్స్ డౌన్‌లోడ్- 2019 డిసెంబర్
ఆన్‌లైన్ ఎగ్జామినేషన్- 2019 డిసెంబర్ 28, 29
ప్రిలిమ్స్ ఫలితాల విడుదల- 2020 జనవరి
మెయిన్స్ కాల్ లెటర్స్ డౌన్‌లోడ్- 2020 జనవరి
ఆన్‌లైన్ ఎగ్జామినేషన్- 2020 జనవరి 25
మెయిన్స్ ఫలితాల విడుదల- 2020 ఫిబ్రవరి
ఇంటర్వ్యూలకు కాల్ లెటర్స్ డౌన్‌లోడ్- 2020 ఫిబ్రవరి
ఇంటర్వ్యూల నిర్వహణ- 2020 ఫిబ్రవరి
ప్రొవిజనల్ అలాట్‌మెంట్- 2020 ఏప్రిల్

విద్యార్హత- సంబంధిత విభాగంలో డిగ్రీ
ఫీజు- ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.100, ఇతర అభ్యర్థులకు రూ.600.
ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మార్కెట్‌లోకి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్... రియల్‌మీ 5ఎస్ ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

AP Anganwadi Jobs: మహిళలకు శుభవార్త... ఆంధ్రప్రదేశ్‌లో 489 అంగన్వాడీ వర్కర్, హెల్పర్ జాబ్స్

Indian Navy Jobs: టెన్త్ అర్హతతో ఇండియన్ నేవీలో 400 జాబ్స్... రేపటి నుంచి దరఖాస్తులు

AP Jobs: ఏపీలో కొత్త జాబ్స్... 1113 మిడ్‌లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఉద్యోగాలకు అప్లై చేయండిలా...
First published: November 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు