IBPS SO RECRUITMENT 2019 TOTAL 1163 SPECIALIST OFFICER JOBS IN BANKS APPLY BEFORE NOVEMBER 26 SS
IBPS SO 2019: బ్యాంకుల్లో 1163 స్పెషలిస్ట్ ఆఫీసర్ జాబ్స్... డిగ్రీ పాసైతే చాలు
IBPS SO 2019: బ్యాంకుల్లో 1163 స్పెషలిస్ట్ ఆఫీసర్ జాబ్స్... డిగ్రీ పాసైతే చాలు
(ప్రతీకాత్మక చిత్రం)
IBPS Specialist Officer Recruitment 2019 | దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 6న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు నవంబర్ 26 చివరి తేదీ. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది ఐబీపీఎస్.
బ్యాంకులో ఉద్యోగం చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్-IBPS దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. మొత్తం 1163 ఖాళీలను ప్రకటించింది. ఐటీ ఆఫీసర్, లా ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఎంపికైనవారికి అలాహాబాద్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనెరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పోస్టింగ్ లభిస్తుంది. దరఖాస్తుకు నవంబర్ 26 చివరి తేదీ. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది ఐబీపీఎస్.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం- 2019 నవంబర్ 6
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 26
అప్లికేషన్ ఫీజు చెల్లింపు- 2019 నవంబర్ 6 నుంచి 2019 నవంబర్ 26
ప్రిలిమినరీ కాల్ లెటర్స్ డౌన్లోడ్- 2019 డిసెంబర్
ఆన్లైన్ ఎగ్జామినేషన్- 2019 డిసెంబర్ 28, 29
ప్రిలిమ్స్ ఫలితాల విడుదల- 2020 జనవరి
మెయిన్స్ కాల్ లెటర్స్ డౌన్లోడ్- 2020 జనవరి
ఆన్లైన్ ఎగ్జామినేషన్- 2020 జనవరి 25
మెయిన్స్ ఫలితాల విడుదల- 2020 ఫిబ్రవరి
ఇంటర్వ్యూలకు కాల్ లెటర్స్ డౌన్లోడ్- 2020 ఫిబ్రవరి
ఇంటర్వ్యూల నిర్వహణ- 2020 ఫిబ్రవరి
ప్రొవిజనల్ అలాట్మెంట్- 2020 ఏప్రిల్
విద్యార్హత- సంబంధిత విభాగంలో డిగ్రీ
ఫీజు- ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.100, ఇతర అభ్యర్థులకు రూ.600.
ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.