హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IBPS Admit Cards: బ్యాంక్ ఉద్యోగార్థులకు అలర్ట్.. అడ్మిట్ కార్డులను విడుదల చేసిన IBPS..

IBPS Admit Cards: బ్యాంక్ ఉద్యోగార్థులకు అలర్ట్.. అడ్మిట్ కార్డులను విడుదల చేసిన IBPS..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

IBPS SO మెయిన్ ఎగ్జామ్ 2023 అడ్మిట్ కార్డ్‌లు విడుదలయ్యాయి. IBPS స్పెషలిస్ట్ ఆఫీసర్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.ibps.in నుండి అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

IBPS SO మెయిన్ ఎగ్జామ్ 2023 అడ్మిట్ కార్డ్‌లు విడుదలయ్యాయి. IBPS స్పెషలిస్ట్ ఆఫీసర్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.ibps.in నుండి అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇప్పుడు మెయిన్ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. IBPS స్పెషలిస్ట్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ (CRP SPL - XII) పరీక్ష 29 జనవరి 2023న జరుగుతుంది. ప్రీ పరీక్ష ఫలితాలు జనవరి 17, 2023న విడుదలయిన సంగతి తెలిసిందే.

అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ ఇలా..

-అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి, ముందుగా అధికారిక వెబ్‌సైట్ అంటే ibps.inని సందర్శించండి.

-ఇక్కడ అడ్మిట్ కార్డ్ అనే లింక్ హోమ్‌పేజీలో కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి.

UGC NET December Session: యూజీసీ నెట్ (UGC NET) నుంచి తాజా అప్ డేట్.. వారికి మరో అవకాశం..

-ఇలా చేయడం వల్ల కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో మీ లాగిన్ వివరాలను నమోదు చేసి, ఎంటర్ బటన్ నొక్కండి.

-తద్వారా IBPS SO మెయిన్స్ పరీక్ష యొక్క అడ్మిట్ కార్డ్ కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

- ఇక్కడ మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. కంప్యూటర్ లో సేవ్ చేసుకొని.. ప్రింట్ తీసుకోండి.

ఐబీపీఎస్ క్యాలెండర్..

ఇదిలా ఉండగా.. ఈ ఏడాది వివిధ బ్యాంకుల్లో క్లర్క్, పీవో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఐబీపీఎస్ క్లర్క్స్, ఐబీపీఎస్ పీవో, ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ, ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పరీక్షలకు సంబంధించిన 2023-24 పరీక్షల క్యాలెండర్‌ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) జనవరి 16న వెల్లడించింది.

రీజనల్ రూరల్ బ్యాంకుల్లో ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్, ప్రొబెషనరీ ఆఫీసర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ పోస్టుల భర్తీకి వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేయనుంది.

Three Exams One Day: ఫిబ్రవరి 26నే మూడు పరీక్షలు..TSPSC DAO పరీక్ష వాయిదా పడుతుందా..?

గ్రామీణ బ్యాంకులో ఆఫీసర్(స్కేల్-1), ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆగస్టు 5, 6, 12, 13, 19 తేదీల్లో ప్రిలిమ్స్ పరీక్ష సెప్టెంబరు 10, 16 తేదీల్లో నిర్వహించనున్నారు. అదేవిధంగా ఆర్‌ఆర్‌బీ ఆఫీసర్ స్కేల్-2, 3 సింగిల్ పరీక్షను సెప్టెంబరు 10న నిర్వహించనుంది. ఐబీపీఎస్ క్లర్క్ పోస్టుల భర్తీకి ఆగస్టు 26, 27, సెప్టెంబరు 2న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. అదేవిధంగా అక్టోబరు 7న మెయిన్ పరీక్ష ఉండనుంది. ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి డిసెంబరు 30, 31 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్ష, 2024 జనవరి 28న మెయిన్ పరీక్షలను ఐబీపీఎస్ నిర్వహించనుంది.

First published:

Tags: IBPS, Ibps so, JOBS, Jobs Exams

ఉత్తమ కథలు