ఇనిస్ట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ఇటీవల స్పెషలిస్ట్ ఆఫీసర్ నియామకాల కోసం మెయిన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూలను నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే.. ఇందుకు సంబంధించిన ఫలితాలను తాజాగా విడుదల చేసింది IBPS. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ www.ibps.in నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫలితాలు ఏప్రిల్ 30 వరకు అందుబాటులో ఉంటాయని IBPS వెల్లడించింది.
ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే.. Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ ibps.in ను ఓపెన్ చేయాలి. Step 2: హోం పేజీలో మీకు స్పెషలిస్ట్ ఆఫీసర్ రిజిల్ట్ లింక్ ఓపెన్ అవుతుంది. Step 3: రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్(డేట్ ఆఫ్ బర్త్) ను నమోదు చేసి లాగిన్ అవ్వాలి. Step 4: అనంతరం మీ రిజిల్ట్ హోం పేజీలో డిస్ప్లే అవుతుంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.