హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Bank Jobs: బ్యాంకు ఉద్యోగం మీ కలా? అప్లై చేయాల్సిన నోటిఫికేషన్లు ఇవే...

Bank Jobs: బ్యాంకు ఉద్యోగం మీ కలా? అప్లై చేయాల్సిన నోటిఫికేషన్లు ఇవే...

Bank Jobs: బ్యాంకు ఉద్యోగం మీ కలా? అప్లై చేయాల్సిన నోటిఫికేషన్లు ఇవే...
(ప్రతీకాత్మక చిత్రం)

Bank Jobs: బ్యాంకు ఉద్యోగం మీ కలా? అప్లై చేయాల్సిన నోటిఫికేషన్లు ఇవే... (ప్రతీకాత్మక చిత్రం)

Bank Jobs | బ్యాంకు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారు ఈ తేదీలను గుర్తుంచుకొని తమ ప్రిపరేషన్‌ను అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి.

  బ్యాంకు ఉద్యోగం మీ కలా? బ్యాంక్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారా? బ్యాంక్ జాబ్ కోసం కోచింగ్ తీసుకుంటున్నారా? అయితే మీరు బ్యాంక్ జాబ్ నోటిఫికేషన్లపై దృష్టి పెట్టాలి. ఇప్పటికే డిగ్రీ పాసైనవారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఏకంగా 7870 పోస్టుల్ని ప్రకటించింది. ఇక బ్యాంకుల్లో క్లర్క్, ప్రొబెషనరీ ఆఫీసర్, స్పెషలిస్ట్ ఆఫీసర్ లాంటి పోస్టుల భర్తీకి ఐబీపీఎస్, ఆర్‌బీఐ, ఎస్‌బీఐ నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. మరి ఏఏ ఉద్యోగానికి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది? పరీక్షలు ఎప్పుడెప్పుడు జరుగుతాయి? అన్న వివరాలు ముందే తెలుసుకుంటే ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవచ్చు. మరి నోటిఫికేషన్ల విడుదలయ్యే తేదీలు తెలుసుకోండి.

  Bank Jobs: పోస్టుల వారీగా నోటిఫికేషన్ల వివరాలు ఇవే...


  SBI Clerk 2020: ఎస్‌బీఐ క్లర్క్ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. దరఖాస్తుకు 2020 జనవరి 26 చివరి తేదీ. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫిబ్రవరి లేదా మార్చిలో, మెయిన్ ఎగ్జామ్ ఏప్రిల్ 13న ఉంటాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  SBI SO 2020: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ ఆఫీసర్ ప్రిలిమినరీ ఎగ్జామ్ 2020 ఫిబ్రవరిలో జరుగుతుంది. మెయిన్ ఎగ్జామ్ తేదీలు వెల్లడించాల్సి ఉంది.

  SBI PO 2020: ఎస్‌బీఐలో ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టులకు 2020 ఏప్రిల్, మేలో ప్రిలిమినరీ ఎగ్జామ్, 2020 జూన్‌లో మెయిన్ ఎగ్జామ్ జరుగుతుంది.

  RBI Assistant 2020: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు కొనసాగుతున్నాయి. దరఖాస్తుకు 2020 జనవరి 16 చివరి తేదీ. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫిబ్రవరీలో, మెయిన్ ఎగ్జామ్ మార్చిలో ఉంటాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  RBI Grade B 2020: ఆర్‌బీఐ గ్రేడ్ బీ పోస్టులకు 2020 జూన్‌లో ప్రిలిమ్స్, 2020 జూలైలో మెయిన్స్ ఎగ్జామ్స్ జరుగుతాయి.

  IBPS RRB 2020: ఆఫీసర్ స్కేల్ 1, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు ప్రిలిమినరీ ఎగ్జామ్ 2020 ఆగస్ట్ 1, 2, 9, 15, 16, 23 తేదీల్లో జరగనుంది. ఆఫీసర్ స్కేల్ 1 మెయిన్స్ ఎగ్జామ్ 2020 సెప్టెంబర్ 20, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుకు మెయిన్స్ 2020 సెప్టెంబర్ 27 తేదీల్లో జరుగుతుంది. ఆఫీసర్ స్కేల్ 2, 3 పోస్టులకు 2020 సెప్టెంబర్ 20న పరీక్ష జరుగుతుంది.

  IBPS PO 2020: ఐబీపీఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు 2020 అక్టోబర్ 10, 11, 17, 18 తేదీల్లో ప్రిలిమినరీ ఎగ్జామ్, 2020 నవంబర్ 29న మెయిన్ ఎగ్జామ్ జరుగుతుంది.

  IBPS Clerk 2020: ఐబీపీఎస్ క్లర్క్ పోస్టులకు 2020 డిసెంబర్ 5, 6, 12, 13 తేదీల్లో ప్రిలిమినరీ ఎగ్జామ్, 2021 జనవరి 17న మెయిన్ ఎగ్జామ్ జరుగుతుంది.

  IBPS SO 2020: ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు 2020 డిసెంబర్ 26, 27 తేదీల్లో ప్రిలిమినరీ ఎగ్జామ్, 2021 జనవరి 24న మెయిన్ ఎగ్జామ్ జరగనుంది.

  బ్యాంకు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారు ఈ తేదీలను గుర్తుంచుకొని తమ ప్రిపరేషన్‌ను అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి. వీటిలో ఇంకా చాలావరకు నోటిఫికేషన్లు విడుదల కావాల్సి ఉంది. నోటిఫికేషన్లు విడుదలైన తర్వాత పరీక్ష తేదీలు అధికారికంగా వెల్లడవుతాయి.

  Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఇవి కూడా చదవండి:

  Railway Jobs: గుడ్ న్యూస్... రైల్వేలో 3,553 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

  Coast Guard Jobs: ఇంటర్ పాసైనవారికి ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో 260 జాబ్స్... అప్లై చేయండిలా

  ECIL Jobs: హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో 185 ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Bank, Banking, CAREER, Exams, IBPS, Job notification, JOBS, NOTIFICATION, Rbi, RRB, Sbi, State bank of india

  ఉత్తమ కథలు