హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IBPS RRB Notification: ఐబీపీఎస్ నుంచి కొత్త నోటిఫికేషన్.. అర్హత, సెలెక్షన్ ప్రాసెస్.. పూర్తి వివరాలిలా..

IBPS RRB Notification: ఐబీపీఎస్ నుంచి కొత్త నోటిఫికేషన్.. అర్హత, సెలెక్షన్ ప్రాసెస్.. పూర్తి వివరాలిలా..

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్‌(IBPS).. రీజినల్‌ రూరల్‌ బ్యాంకుల్లో(ఆర్ఆర్‌బీ) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్‌(IBPS).. రీజినల్‌ రూరల్‌ బ్యాంకుల్లో(Regional Rural Banks) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. కామ‌న్ రిక్రూట్‌మెంట్(Common Recruitment) ప్రాసెస్‌-XI ద్వారా ఆఫీస‌ర్లు(స్కేల్- I, II & III), ఆఫీస్ అసిస్టెంట్ (Multipurpose) పోస్టుల భర్తీకి త్వరలోనే ఆన్‌లైన్‌లో(Online) పరీక్షలను నిర్వహించనుంది. ఆగస్టు(August), సెప్టెంబర్/ అక్టోబర్‌లో పరీక్షలు జరిగే అవకాశం ఉంది. ఆఫీసర్స్ పోస్ట్ రిక్రూట్‌మెంట్(Recruitment) కోసం ఇంటర్వ్యూలు(Interviews) నవంబర్‌లో జరగనున్నాయి.

JEE Main-2022: జేఈఈ మెయిన్‌కు ప్రిపేర్ అవుతున్నారా..? ఈ ప్రాక్టీస్ ప్రశ్నలతో మీ సామర్థ్యాన్ని అంచనా వేసుకోండి..!

అర్హత ప్రమాణాలు

ఏదైనా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్‌ (స్కేల్- I, II & III), ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్)గా జాయిన్ అవ్వాలని అనుకుంటున్న అభ్యర్థులు ముందుగా కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ XI కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆఫీసర్స్(స్కేల్ I), ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ-పర్పస్) పోస్టులకు పరీక్ష ఆన్‌లైన్‌లో రెండు దశల్లో ఉంటుంది. మొదటిది ప్రిలిమినరీ కాగా, రెండో దశలో మెయిన్ పరీక్ష ఉండనుంది. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్ట్ కోసం ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించి షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు, మెయిన్ పరీక్షకు హాజరు కావాలి. మెయిన్ పరీక్షలో సాధించిన మార్కులు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ నివేదించిన వాస్తవ ఖాళీల ఆధారంగా అభ్యర్థులను కేటాయించనున్నారు.

JEE Alternatives: జేఈఈతో సంబంధం లేకుండా ఇంజనీరింగ్ చదివే అవకాశం.. ఆల్టర్నేటివ్ ఎంట్రన్స్ టెస్ట్‌లు ఇవే..

ఆఫీసర్స్ స్కేల్ I పోస్ట్ కోసం.. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో అర్హత సాధించి, షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు మెయిన్ పరీక్షకు హాజరు కావాలి. మెయిన్ పరీక్ష ద్వారా షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను కామన్ ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు. ఆఫీసర్స్ స్కేల్ II (జనరలిస్ట్ అండ్ స్పెషలిస్ట్‌లు), స్కేల్ III పోస్టుల కోసం, అభ్యర్థులు ఒకే ఆన్‌లైన్ పరీక్షకు హాజరుకానున్నారు. ఇక్కడ షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను కామన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.

రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన వివరాలు

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఎడిట్, పేమెంట్- జూన్ 7 నుంచి జూన్ 27 వరకు.

ప్రీ- ఎగ్జామ్ ట్రైనింగ్ (PET) - జూలై 18 నుంచి జూలై 27

ఆన్ లైన్ ఎగ్జామ్ (ప్రిలిమినరీ)- 2022 ఆగస్టు

ప్రిలిమినరీ ఆన్‌లైన్ ఎగ్జామ్ ఫలితాలు - సెప్టెంబర్

ఆన్‌లైన్ ఎగ్జామ్ (మెయిన్/ సింగిల్)- సెప్టెంబర్/ అక్టోబర్ 2022

మరోవైపు, సెలక్షన్ పోస్ట్ ఫేజ్ X- 2022 కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తు ప్రక్రియ మే 12 నుంచి ప్రారంభం కాగా, దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 13గా నిర్ణయించింది. అలాగే దరఖాస్తు ఫారంలోని తప్పులను సవరించడం కోసం జూన్ 20 నుంచి జూన్ 24 వరకు సమయం కేటాయించింది. కంప్యూటర్ మోడ్‌లో పరీక్ష జరగనుంది. అయితే అధికారికంగా పరీక్ష తేదీని ఎస్ఎస్‌సీ ఇంకా ప్రకటించలేదు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 2065 ఖాళీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భర్తీ చేయనుంది.

First published:

Tags: Banking news, Career and Courses, Exam pattern, Exam Tips, IBPS

ఉత్తమ కథలు