Home /News /jobs /

IBPS RRB RECRUITMENT 2022 LAST DAY TO APPLY FOR 8285 VACANCIES OF OFFICERS AND OFFICE ASSTANTS VB

IBPS Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. 8,285 ఉద్యోగాల దరఖాస్తుకు నేడే చివరి గడువు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్(Prepare) అయ్యే వారికి రీజినల్ రూరల్ బ్యాంకుల్లో (RRB) ఉద్యోగాల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(IBPS) నోటిఫికేషన్(Notification) వెల్లడించిన విషయం తెలిసిందే.

బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్(Prepare) అయ్యే వారికి రీజినల్ రూరల్ బ్యాంకుల్లో (RRB) ఉద్యోగాల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(IBPS) నోటిఫికేషన్(Notification) వెల్లడించిన విషయం తెలిసిందే. గ్రూప్ A ఆఫీసర్లు(Officers) (స్కేల్-I, II, III), గ్రూప్ B ఆఫీస్ అసిస్టెంట్(Office Assistant) (మల్టీపర్పస్) పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. తాజాగా పోస్టుల సంఖ్యను పెంచుతున్నట్లు IBPS తెలిపింది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం 43 RRBలలో మొత్తం ఖాళీల సంఖ్యను 8106 నుంచి 8285కి పెంచింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ibps.in అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 27. అంటే నేటితో ఈ దరఖాస్తు గడువు ముగియనుంది. ఇంకా ఎవరైన దరఖాస్తు చేసుకోకపోతే వెంటనే ibps.in వెబ్ సైట్ ను సందర్శించి అప్లికేషన్ చేసుకోవచ్చు.

అర్హతలు:
ఆఫీస్ అసిస్టెంట్ కోసం (మల్టీపర్పస్).. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. కంప్యూటర్‌పై పరిజ్ఞానం ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అభ్యర్థి వయసు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.



ఆఫీసర్ స్కేల్-I (అసిస్టెంట్ మేనేజర్) కోసం.. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా దాని తత్సమానం చేసి ఉండాలి. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ మొదలైన వాటిలో డిగ్రీ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. స్థానిక భాషలో ప్రావీణ్యం మరియు కంప్యూటర్‌పై పని పరిజ్ఞానం ఉండాలి. అభ్యర్థి వయసు 18 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి.

Govt Internships: ఇంటర్న్‌షిప్ ఆఫర్స్ కోసం చూస్తున్నారా..? ఈ గవర్నమెంట్ ఇంటర్న్‌షిప్స్ లిస్ట్ మీకోసమే..!

ఆఫీసర్ స్కేల్-II (మేనేజర్) కోసం.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా మొత్తంగా కనీసం 50% మార్కులతో సమానమైన డిగ్రీ కలిగి ఉండాలన్నారు. అభ్యర్థి కనీస వయసు 21- 32 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఆఫీసర్ స్కేల్-III (సీనియర్ మేనేజర్) కోసం.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా మొత్తంగా కనీసం 50% మార్కులతో సమానమైన డిగ్రీ ఉండాలి. బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌లలో ఆఫీసర్‌గా కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.అభ్యర్థి వయసు 21 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం ఇలా..

స్టెప్ 1: IBPS అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్ చేయండి.

స్టెప్ 2: హోమ్‌పేజీలో, “CRP for RRBs” లింక్‌పై క్లిక్ చేయండి.

స్టెప్ 3: మీరు ఏ పోస్టుకు అప్లై చేయాలో ఎంచుకోండి.

స్టెప్ 4: అవసరమైన వివరాలను నింపి రిజిస్టర్ చేసుకోండి.

CBI Internship: ఆ విద్యార్థులకు శుభవార్త.. స్పెషల్ ఇంటర్న్‌షిప్ ఆఫర్ చేస్తున్న సీబీఐ.. వివరాలివే

ఆఫీసర్ (స్కేల్ I, II & III) పోస్టులకు దరఖాస్తు చేసుకునే SC, ST, PWBD కేటగిరీల అభ్యర్థులు రూ. 175 అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇతర వర్గాలకు చెందిన అభ్యర్థులు రూ. 850 చెల్లించాలి. అయితే ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులకు.. SC, ST, PWBD, EXSM కేటగిరీల అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ. 175, మిగతా వారికి రూ. 850గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. మొదటి ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ
అభ్యర్థులు IBPS RRB ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్), మెయిన్ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్) మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడతారు. ఇంటర్వ్యూ ప్రక్రియ / ప్రధాన పరీక్ష పూర్తయిన తర్వాత, షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకుంటారు.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, IBPS, Ibps rrb, JOBS, RRB

తదుపరి వార్తలు