IBPS RRB 2021: నిరుద్యోగులకు అలర్ట్... 10,000 పైగా బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్

IBPS RRB 2021: నిరుద్యోగులకు అలర్ట్... 10,000 పైగా బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ (ప్రతీకాత్మక చిత్రం)

IBPS RRB 2021 | దేశవ్యాప్తంగా ఉన్న రీజనల్ రూరల్ బ్యాంకుల్లో ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    బ్యాంకు ఉద్యోగం కోరుకునేవారికి అలర్ట్. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్-IBPS ఉద్యోగాల భర్తీకి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రీజనల్ రూరల్ బ్యాంకుల్లో ఆఫీసర్ స్కేల్ 1 (ప్రొబెషనరీ ఆఫీసర్), మల్టీపర్పస్ (క్లర్క్), ఆఫీసర్ స్కేల్ 2, ఆఫీసర్ స్కేల్ 3 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న రీజనల్ రూరల్ బ్యాంకుల్లో 10,000 పైగా పోస్టులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంకులో కూడా ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఈరోజే మొదలైంది. అప్లై చేయడానికి 2021 జూన్ 28 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.ibps.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు లింక్ ఉంటుంది. అప్లై చేయడానికి ముందు విద్యార్హతల వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవాలి.

    Jobs: బ్యాంక్ నోట్ ప్రెస్‌లో జాబ్స్... దరఖాస్తుకు 3 రోజులే గడువు

    BIS Recruitment 2021: కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    IBPS RRB Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన తేదీలు


    ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2021 జూన్ 8
    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూన్ 28
    ఫీజు చెల్లించడానికి చివరి తేదీ- 2021 జూన్ 28
    ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్ లెటర్ డౌన్‌లోడ్- 2021 జూలై 9 నుంచి
    ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్- 2021 జూలై 19 నుంచి 25
    ప్రిలిమినరీ ఎగ్జామ్ కాల్ లెటర్ డౌన్‌లోడ్- 2021 జూలై లేదా ఆగస్ట్
    ప్రిలిమినరీ ఎగ్జామ్- 2021 ఆగస్ట్
    ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫలితాలు- 2021 సెప్టెంబర్
    మెయిన్ లేదా సింగిల్ ఎగ్జామ్ కాల్ లెటర్ డౌన్‌లోడ్- 2021 సెప్టెంబర్
    మెయిన్ లేదా సింగిల్ ఎగ్జామ్- 2021 సెప్టెంబర్ లేదా అక్టోబర్
    మెయిన్ లేదా సింగిల్ ఎగ్జామ్ ఫలితాల విడుదల- 2021 అక్టోబర్
    ఇంటర్వ్యూ కోసం కాల్ లెటర్స్ డౌన్‌లోడ్- 2021 అక్టోబర్ లేదా నవంబర్
    ఇంటర్వ్యూ- 2021 అక్టోబర్ లేదా నవంబర్
    ప్రొవిజనల్ అలాట్‌మెంట్- 2022 జనవరి

    Andhra Pradesh Jobs 2021: ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య మిత్ర పోస్టులకు నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే

    SBI Clerk Jobs 2021: ఎస్‌బీఐలో 5454 ఉద్యోగాలకు త్వరలో పరీక్ష... ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ ఇదే

    IBPS RRB Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    విద్యార్హత- ఆఫీసర్ స్కేల్ 1, 2, 3 పోస్టులతో పాటు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నాయి. డిగ్రీ, ఎంబీఏ లాంటి కోర్సులు చేసినవారు దరఖాస్తు చేయొచ్చు. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
    వయస్సు- ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుకు 18 నుంచి 28 ఏళ్లు, ఆఫీసర్ స్కేల్ I పోస్టుకు 18 నుంచి 30 ఏళ్లు, ఆఫీసర్ స్కేల్ II పోస్టుకు 21 నుంచి 32 ఏళ్లు, ఆఫీసర్ స్కేల్ III పోస్టుకు 21 నుంచి 40 ఏళ్లు. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
    ఎంపిక విధానం- ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్ I పోస్టులకు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఆఫీసర్ స్కేల్ II, III పోస్టులకు సింగిల్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ.
    దరఖాస్తు ఫీజు- రూ.850. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.180.
    Published by:Santhosh Kumar S
    First published: