Home /News /jobs /

IBPS RRB RECRUITMENT 2021 INSTITUTE OF BANKING PERSONNEL SELECTION INVITES APPLICATIONS FOR 10676 POSTS KNOW HOW TO APPLY SS

IBPS RRB Jobs 2021: మొత్తం 10,676 బ్యాంకు ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

IBPS RRB Jobs 2021: మొత్తం 10,676 బ్యాంకు ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

IBPS RRB Jobs 2021: మొత్తం 10,676 బ్యాంకు ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

IBPS RRB Recruitment 2021 | ఐబీపీఎస్ రీజనల్ రూరల్ బ్యాంకుల్లో మొత్తం 10,676 పోస్టులకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.

    ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్-IBPS మరో భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్న రీజనల్ రూరల్ బ్యాంకుల్లో ఆఫీసర్ స్కేల్ 1 (ప్రొబెషనరీ ఆఫీసర్), మల్టీపర్పస్ (క్లర్క్), ఆఫీసర్ స్కేల్ 2, ఆఫీసర్ స్కేల్ 3 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ 2021 జూన్ 8న ప్రారంభించింది. మొత్తం 10,676 ఖాళీలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ బ్యాంకుల్లో కూడా ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2021 జూన్ 28 లాస్ట్ డేట్. ఆసక్తి గల అభ్యర్థులు https://www.ibps.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. అప్లై చేసే ముందు విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి. మరి ఈ పోస్టులకు ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.

    Jobs in Uber: ఊబెర్‌లో భారీగా ఉద్యోగాలు... హైదరాబాద్, బెంగళూరులో ఖాళీలు

    Teacher Jobs 2021: మొత్తం 5,807 టీజీటీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభం

    IBPS RRB Recruitment 2021: దరఖాస్తు చేయండి ఇలా


    అభ్యర్థులు ముందుగా https://www.ibps.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
    హోమ్ పేజీలో Click here to View Advertisement for CRP RRBs X పైన క్లిక్ చేయాలి.
    నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. నోటిఫికేషన్ పూర్తిగా చదివి వివరాలు తెలుసుకోవాలి.
    అన్ని విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు Apply online for CRP RRBs X లింక్ పైన క్లిక్ చేయాలి.
    కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ఆఫీసర్ స్కేల్ 1 (ప్రొబెషనరీ ఆఫీసర్), మల్టీపర్పస్ (క్లర్క్), ఆఫీసర్ స్కేల్ 2, ఆఫీసర్ స్కేల్ 3 పోస్టులకు వేర్వేరు లింక్స్ ఉంటాయి.
    అప్లై చేయాలనుకున్న పోస్టుకు సంబంధించిన లింక్ పైన క్లిక్ చేయాలి.
    కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Click Here for New Registration పైన క్లిక్ చేయాలి.
    దరఖాస్తు ప్రక్రియలో మొత్తం 6 స్టెప్స్ ఉంటాయి.
    పేరు, పుట్టిన తేదీ, అడ్రస్, కాంటాక్ట్ నెంబర్, ఇమెయిల్ ఐడీ లాంటి వివరాలతో మొదటి స్టెప్ పూర్తి చేసి save and next బటన్ పైన క్లిక్ చేయాలి.
    రెండో స్టెప్‌లో ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
    ఆ తర్వాత విద్యార్హతలు, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వివరాలు ఎంటర్ చేసి మూడో స్టెప్ పూర్తి చేయాలి.
    నాలుగో స్టెప్‌లో అప్లికేషన్ ప్రివ్యూ చూసుకోవాలి. వివరాలన్నీ సరిగ్గానే ఉన్నాయో లేదో చెక్ చేయాలి.
    ఐదో స్టెప్‌లో ఇతర సర్టిఫికెట్స్ అప్‌లోడ్ చేయాలి.
    ఆరో స్టెప్‌లో ఫీజు పేమెంట్ చేయాలి.
    ఫీజు చెల్లించిన తర్వాత Final Submit పైన క్లిక్ చేయాలి.

    Coal India Recruitment 2021: కోల్ ఇండియాలో 1086 ఉద్యోగాలు... ఏడో తరగతి పాస్ అయితే చాలు

    DRDO Recruitment 2021: డీఆర్‌డీఓలో అప్రెంటీస్ ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి. సీఏ, ఎంబీఏ, డిగ్రీ పాస్ అయినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. జూన్ 28 లోగా అప్లై చేయాలి. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆగస్ట్‌లో, మెయిన్స్, సింగిల్ ఎగ్జామ్ 2021 సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ఉంటాయి. అక్టోబర్ లేదా నవంబర్‌లో ఇంటర్వ్యూలు ఉంటాయి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Bank Jobs 2021, CAREER, Exams, Government jobs, Govt Jobs 2021, IBPS, Job notification, JOBS, NOTIFICATION, RRB, Upcoming jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు