IBPS RRB 2021: రీజనల్ రూరల్ బ్యాంకుల్లో 10,676 ఉద్యోగాలు... పరీక్ష సిలబస్ ఇదే

IBPS RRB 2021: రీజనల్ రూరల్ బ్యాంకుల్లో 10,676 ఉద్యోగాలు... పరీక్ష సిలబస్ ఇదే (ప్రతీకాత్మక చిత్రం)

IBPS RRB Recruitment 2021 | రీజనల్ రూరల్ బ్యాంకుల్లో 10,676 పోస్టులు భర్తీ కాబోతున్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్-IBPS దేశవ్యాప్తంగా రీజనల్ రూరల్ బ్యాంకుల్లో 10,676 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోని రీజనల్ రూరల్ బ్యాంకుల్లో 800 పైగా పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేయడానికి 2021 జూన్ 28 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్ వివరాలను https://www.ibps.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. కొన్ని పోస్టులకు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా, ఇంకొన్ని పోస్టులకు సింగిల్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనుంది ఐబీపీఎస్. ప్రిలిమ్స్ పరీక్షలు ఆగస్టులో, మెయిన్స్, సింగిల్ ఎగ్జామ్ సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ఉంటాయి. ఈ పరీక్షలకు సంబంధించిన సిలబస్ వివరాలు తెలుసుకోండి.

    Office Assistant (Multipurpose) Preliminary Examination: మొత్తం 80 ప్రశ్నలకు 80 మార్కులు ఉంటాయి. రీజనింగ్ 40 ప్రశ్నలకు 40 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ 40 ప్రశ్నలకు 40 మార్కులుంటాయి. పరీక్ష సమయం 45 నిమిషాలు.

    Coast Guard Recruitment 2021: ఇండియన్ కోస్ట్ గార్డులో 350 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    Railway Jobs 2021: రైల్వేలో 3378 ఉద్యోగాలు... ఆంధ్రప్రదేశ్‌లోని ఆ రెండు జిల్లా అభ్యర్థులకు అవకాశం

    Office Assistant (Multipurpose) Main Examination: మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులుంటాయి. రీజనింగ్ 40 ప్రశ్నలకు 50 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్ 40 ప్రశ్నలకు 20 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 40 ప్రశ్నలకు 40 మార్కులు, ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ 40 ప్రశ్నలకు 40 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ 40 ప్రశ్నలకు 50 మార్కులు ఉంటాయి. మొత్తం సమయం 2 గంటలు.

    Officer Scale-I Preliminary Examination: మొత్తం 80 ప్రశ్నలకు 80 మార్కులు ఉంటాయి. రీజనింగ్‌కు 40 ప్రశ్నలకు 40 మార్కులు, క్వాంటిటీవ్ యాప్టిట్యూడ్ 40 ప్రశ్నలకు 40 మార్కులుంటాయి. పరీక్ష సమయం 45 నిమిషాలు.

    Officer Scale-I Main Examination: మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులుంటాయి. రీజనింగ్ 40 ప్రశ్నలకు 50 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్ 40 ప్రశ్నలకు 20 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 40 ప్రశ్నలకు 40 మార్కులు, ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ 40 ప్రశ్నలకు 40 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ 40 ప్రశ్నలకు 50 మార్కులు ఉంటాయి. మొత్తం సమయం 2 గంటలు.

    MDL Recruitment 2021: మజగాన్ డాక్ లిమిటెడ్‌లో 1388 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే

    Govt Jobs after 10th: టెన్త్ పాస్ అయ్యారా? ఈ ప్రభుత్వ ఉద్యోగాలు మీకోసమే

    Officer Scale-II (General Banking Officer) Single level Examination: మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులుంటాయి. రీజనింగ్ 40 ప్రశ్నలకు 50 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్ 40 ప్రశ్నలకు 20 మార్కులు, ఫైనాన్షియల్ అవేర్‌నెస్ 40 ప్రశ్నలకు 40 మార్కులు, ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ 40 ప్రశ్నలకు 40 మార్కులు, క్వాంటిటేటీవ్ యాప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్‍ప్రిటేషన్ 40 ప్రశ్నలకు 50 మార్కులు ఉంటాయి. మొత్తం సమయం 2 గంటలు.

    Officer Scale-II (Specialist Cadre) Single level Examination: మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులుంటాయి. ప్రొఫెషనల్ నాలెడ్జ్ 40 ప్రశ్నలకు 40 మార్కులు, రీజనింగ్ 40 ప్రశ్నలకు 40 మార్కులు, ఫైనాన్షియల్ అవేర్‌నెస్ 40 ప్రశ్నలకు 40 మార్కులు, ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ 40 ప్రశ్నలకు 20 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్ 40 ప్రశ్నలకు 20 మార్కులు, క్వాంటిటేటీవ్ యాప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్‍ప్రిటేషన్ 40 ప్రశ్నలకు 40 మార్కులు ఉంటాయి. మొత్తం సమయం 2 గంటలు.

    Officer Scale- III Single level Examination: మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులుంటాయి. రీజనింగ్ 40 ప్రశ్నలకు 50 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్ 40 ప్రశ్నలకు 20 మార్కులు, ఫైనాన్షియల్ అవేర్‌నెస్ 40 ప్రశ్నలకు 40 మార్కులు, ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ 40 ప్రశ్నలకు 40 మార్కులు, క్వాంటిటేటీవ్ యాప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్‍ప్రిటేషన్ 40 ప్రశ్నలకు 50 మార్కులు ఉంటాయి. మొత్తం సమయం 2 గంటలు.
    Published by:Santhosh Kumar S
    First published: