IBPS RRB Recruitment 2021: మొత్తం 10,676 బ్యాంకు ఉద్యోగాలు... తెలుగు రాష్ట్రాల్లో ఖాళీల వివరాలు ఇవే

IBPS RRB Recruitment 2021: మొత్తం 10,676 బ్యాంకు ఉద్యోగాలు... తెలుగు రాష్ట్రాల్లో ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

IBPS RRB Recruitment 2021 | బ్యాంకు ఉద్యోగాలు కోరుకునేవారికి భారీ నోటిఫికేషన్ వచ్చింది. 10,676 పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్-IBPS దేశవ్యాప్తంగా ఉన్న రీజనల్ రూరల్ బ్యాంకుల్లో 10,676 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీసర్ స్కేల్ 1 (ప్రొబెషనరీ ఆఫీసర్), మల్టీపర్పస్ (క్లర్క్), ఆఫీసర్ స్కేల్ 2, ఆఫీసర్ స్కేల్ 3 పోస్టుల్ని భర్తీ చేయనుంది ఐబీపీఎస్. తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ బ్యాంకుల్లో కూడా ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఐబీపీఎస్. హైదరాబాద్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్, వరంగల్‌లోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంక్, గుంటూరులోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ, ఎంబీఏ లాంటి కోర్సులు పూర్తి చేసినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు. 2021 జూన్ 28 లోగా అప్లై చేయాలి. మరిన్ని వివరాలు https://www.ibps.in/ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. విద్యార్హతలు, ఇతర వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    IBPS RRB Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 10,676
    ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్)- 5305
    ఆఫీసర్ స్కేల్ 1- 4119
    ఆఫీసర్ స్కేల్ 2 (అగ్రికల్చర్ ఆఫీసర్)- 25
    ఆఫీసర్ స్కేల్ 2 (మార్కెటింగ్ ఆఫీసర్)- 43
    ఆఫీసర్ స్కేల్ 2 (ట్రెజరీ మేనేజర్)- 9
    ఆఫీసర్ స్కేల్ 2 (లా)- 27
    ఆఫీసర్ స్కేల్ 2 (సీఏ)- 32
    ఆఫీసర్ స్కేల్ 2 (ఐటీ)- 59
    ఆఫీసర్ స్కేల్ 2 (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్)- 906
    ఆఫీసర్ స్కేల్ 3 - 151

    Andhra Pradesh Jobs 2021: ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య మిత్ర జాబ్స్... రేపే లాస్ట్ డేట్

    India Post GDS Results 2021: తెలంగాణ, ఏపీ గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల ఫలితాలు ఎప్పుడంటే...

    IBPS RRB Recruitment 2021: ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీల వివరాలు ఇవే...


    చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, గుంటూరు
    ఆఫీస్ అసిస్టెంట్- 156
    ఆఫీసర్ స్కేల్ 1- 60
    ఆఫీసర్ స్కేల్ 2- 31

    సప్తగిరి గ్రామీణ బ్యాంక్, చిత్తూరు
    ఆఫీస్ అసిస్టెంట్- 134
    ఆఫీసర్ స్కేల్ 1- 21
    ఆఫీసర్ స్కేల్ 3- 4

    SBI Clerk Jobs 2021: ఎస్‌బీఐలో 5454 ఉద్యోగాలకు త్వరలో పరీక్ష... ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ ఇదే

    Teacher Jobs 2021: మొత్తం 5,807 టీజీటీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభం

    IBPS RRB Recruitment 2021: తెలంగాణలో ఖాళీల వివరాలు ఇవే...


    ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, వరంగల్
    ఆఫీస్ అసిస్టెంట్- 225
    ఆఫీసర్ స్కేల్ 1- 50
    ఆఫీసర్ స్కేల్ 2- 10

    తెలంగాణ గ్రామీణ బ్యాంక్, హైదరాబాద్
    ఆఫీస్ అసిస్టెంట్- 120
    ఆఫీసర్ స్కేల్ 1- 36
    ఆఫీసర్ స్కేల్ 2- 12

    ఈ పోస్టులకు అప్లై చేయడానికి 20 రోజులు మాత్రమే అవకాశం ఉంది. డిగ్రీ, ఎంబీఏ పాస్ అయినవారు దరఖాస్తు చేయాలి. అప్లై చేయడానికి ముందు నోటిఫికేషన్‌లో విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనుంది ఐబీపీఎస్. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published: