IBPS RRB 2020: మొత్తం 9640 బ్యాంకు ఉద్యోగాల భర్తీకి ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

IBPS RRB 2020 Exam Dates | ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబర్‌లో ప్రిలిమ్స్, అక్టోబర్‌లో మెయిన్స్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.

news18-telugu
Updated: August 12, 2020, 4:33 PM IST
IBPS RRB 2020: మొత్తం 9640 బ్యాంకు ఉద్యోగాల భర్తీకి ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
IBPS RRB 2020: మొత్తం 9640 బ్యాంకు ఉద్యోగాల భర్తీకి ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్-IBPS రీజనల్ రూరల్ బ్యాంకు-RRB ఉద్యోగాలకు దరఖాస్తు చేసినవారికి శుభవార్త. పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. ప్రిలిమ్స్ సెప్టెంబర్‌లో, మెయిన్స్, సింగిల్ ఎగ్జామ్ అక్టోబర్‌లో నిర్వహిస్తున్నట్టు ఐబీపీఎస్ ప్రకటించింది. ప్రస్తుతానికి తాత్కాలిక షెడ్యూల్ ప్రకటించింది. రీజనల్ రూరల్ బ్యాంకుల్లో ఆఫీసర్ స్కేల్ -1, 2, 3, ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్) పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ గత నెలలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జూలై 1 నుంచి 21 వరకు దరఖాస్తుల్ని కూడా స్వీకరించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రీజనల్ రూరల్ బ్యాంకుల్లో 9640 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఆఫీసర్ స్కేల్ 1, ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్) పోస్టుల్ని ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్స్ ద్వారా, ఆఫీసర్ స్కేల్ 2, 3 పోస్టుల్ని సింగిల్ ఎగ్జామ్ ద్వారా భర్తీ చేస్తోంది. పరీక్షలు నిర్వహించిన తర్వాత ఇంటర్వ్యూ తేదీలను వెల్లడించనుంది ఐబీపీఎస్. ఈ పరీక్షలకు సంబంధించి ఐబీపీఎస్ ప్రకటించిన షెడ్యూల్ ఇదే.

ONGC Jobs: ఓఎన్‌జీసీలో 4182 జాబ్స్... కాకినాడ, రాజమండ్రిలో ఖాళీల భర్తీ

SBI Jobs: డిగ్రీ పాసైనవారికి ఎస్‌బీఐలో 3850 ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

IBPS RRB 2020 Exam Dates: ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ పరీక్షల తేదీలు ఇవే...


ఆఫీసర్ స్కేల్ 1, ఆఫీస్ అసిస్టెంట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్- 2020 సెప్టెంబర్ 12, 13, 19, 20, 26
ఆఫీసర్ స్కేల్ 1 మెయిన్ ఎగ్జామినేషన్- 2020 అక్టోబర్ 18
ఆఫీస్ అసిస్టెంట్ మెయిన్ ఎగ్జామినేషన్- 2020 అక్టోబర్ 31ఆఫీసర్ స్కేల్ 2, 3 సింగిల్ ఎగ్జామ్- 2020 అక్టోబర్ 18

వాస్తవానికి ఈ పోస్టులకు సంబంధించిన పరీక్షలకు ముందుగానే షెడ్యూల్ ప్రకటించింది ఐబీపీఎస్. కానీ కరోనా వైరస్ సంక్షోభం కారణంగా షెడ్యూల్ మారింది. కరోనా వైరస్ సంక్షోభం ఇంకా కొనసాగుతుండటంతో ఈ పరీక్షల షెడ్యూల్‌లో ఏవైనా మార్పులు ఉండొచ్చు. అన్నీ సవ్యంగా జరిగితే ఈ షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయి. అందుకే అభ్యర్థులు పరీక్షల షెడ్యూల్‌కు సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ https://www.ibps.in/ ఫాలో అవుతూ ఉండాలి.
Published by: Santhosh Kumar S
First published: August 12, 2020, 4:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading