ఐబీపీఎస్(IBPS), రిజినల్ రూరల్ బ్యాంక్(RRB) క్లర్క్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్ సైట్ నుంచి రిజల్ట్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. IBPS RRB Clerk Prelims Result ను డౌన్ లోడ్ చేసుకోవాలనుకుంటున్న వారు ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది.
-అభ్యర్థులు మొదటగా
ibps.in వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
-సైట్ ఓపెన్ చేయగానే ‘Click here to View Your Result Status of Online Preliminary Examination for CRP RRB IX - Office Assistant (Multipurpose)’ అనే లింక్ స్క్రోల్ అవుతూ కనిపిస్తోంది.
-వెంటనే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో రిజిస్ట్రేషన్ నంబర్, రోల్ నంబర్ లేదా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
-అనంతరం లాగిన్ బటన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
-అనంతరం మీకు రిజల్ట్ కనిపిస్తుంది. దానిని డౌన్ లోడ్ చేసుకుని దాచుకోవాలి.
-ఇందుకు సంబంధించిన స్కోర్ కార్డులను సైతం త్వరలోనే అభ్యర్థులకు అందిస్తారు.
Result Direct Link
IBPS RRB Clerk Mains Exam 2021: మెయిన్స్ పరీక్షను వచ్చే ఫిబ్రవరి 28న నిర్వహించనున్నారు. ప్రిలిమ్స్ పరీక్షలో క్వాలిఫై అయిన వారు మెయిన్స్ కు హాజరు కావచ్చు. ఇందుకు సంబంధించిన అడ్మిట్ కార్డులు ఫిబ్రవరి 2న విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
Published by:Nikhil Kumar S
First published:January 21, 2021, 19:14 IST