హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Prelims Result 2022: ఆ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ను ఇలా చెక్ చేసుకోండి..

Prelims Result 2022: ఆ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ను ఇలా చెక్ చేసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Prelims Result 2022: ఆగస్టు 7 , 13, 14 తేదీలలో రాసిన ఆ పరీక్ష ఫలితాలను బోర్డు విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు కింద తెలిపిన లింక్ ద్వారా డైరెక్ట్ గా ఫలితాలను తనిఖీ చేయవచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) గ్రూప్ B ఆఫీస్ అసిస్టెంట్ లేదా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులలో (RRBs) క్లర్క్ రిక్రూట్‌మెంట్ 2022 కు సంబంధించి ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. IBPS RRB క్లర్క్ కు సంబంధించి ఆగస్టు 2022లో జరిగిన రిక్రూట్‌మెంట్ పరీక్షలో హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ibps.inని సందర్శించడం ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఫలితాన్ని చెక్ చేయడానికి, అభ్యర్థులు వారి రోల్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేయాలి.

Jobs In IBM: డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసిన వారికి శుభవార్త.. ఐబీఎంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..


IBPS RRB ఆఫీస్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ ప్రిలిమ్స్ పరీక్ష 7 ఆగస్టు, 13 ఆగస్టు మరియు 14 ఆగస్టు 2022లో జరిగింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ibps.inలో తమ ఫలితాలను చూసుకోవచ్చు. ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులైన వారిని మెయిన్స్‌కు పిలుస్తారు. మెయిన్స్ పరీక్షను అక్టోబర్ 1న నిర్వహించనున్నారు.


ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి.
Step 1: ముందుగా IBPS అధికారిక వెబ్‌సైట్ ibps.inకి వెళ్లండి.
Step 2: హోమ్ పేజీలో, 'CRP-RRBs-XI ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) కోసం ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష Results తెలుసుకోండి అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి.
Step 3: మీ రోల్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా లాగిన్ చేయొచ్చు.
Step 4: IBPS RRB క్లర్క్ ఫలితం స్క్రీన్‌పై తెరవబడుతుంది.
Step 5: ఫలితాలను చెక్ చేసుకొని.. డౌన్‌లోడ్ చేసుకోవాలి. భవిష్యత్ అవసరాల కొరకు దానిని ప్రింట్ తీసుకొని మీ వద్ద ఉంచుకోండి.
రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన అర్హతలు ఇలా..
ఏదైనా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్‌ (స్కేల్- I, II & III), ఆఫీస్ అసిస్టెంట్ (Multipurpose)గా జాయిన్ అవ్వాలని అనుకుంటున్న అభ్యర్థులు ముందుగా కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ XI కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సంబంధిత పోస్టులకు డిగ్రీ విద్యార్హత తప్పనిసరి.
ఆఫీసర్స్(స్కేల్ I), ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ-పర్పస్) పోస్టులకు పరీక్ష ఆన్‌లైన్‌లో రెండు దశల్లో ఉంటుంది. మొదటిది ప్రిలిమినరీ కాగా, రెండో దశలో మెయిన్ పరీక్ష ఉండనుంది. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్ట్ కోసం ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించి షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు, మెయిన్ పరీక్షకు హాజరు కావాలి. మెయిన్ పరీక్షలో సాధించిన మార్కులు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ నివేదించిన వాస్తవ ఖాళీల ఆధారంగా అభ్యర్థులను కేటాయించనున్నారు.

Demand Course: ఇ‘లా’ చేయండి.. నెలకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు సంపాదించొచ్చు..


ఆఫీసర్స్ స్కేల్ I పోస్ట్ కోసం.. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో అర్హత సాధించి, షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు మెయిన్ పరీక్షకు హాజరు కావాలి. మెయిన్ పరీక్ష ద్వారా షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను కామన్ ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు. ఆఫీసర్స్ స్కేల్ II (జనరలిస్ట్ అండ్ స్పెషలిస్ట్‌లు), స్కేల్ III పోస్టుల కోసం, అభ్యర్థులు ఒకే ఆన్‌లైన్ పరీక్షకు హాజరుకానున్నారు. ఇక్కడ షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను కామన్ ఇంటర్వ్యూ (Interview) కు హాజరు కావాల్సి ఉంటుంది.
ఎన్ని పోస్టులను రిక్రూట్ చేస్తారో తెలుసుకోండి
ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల మొత్తం సంఖ్య - 8106
పోస్టుల వివరాలు
ఆఫీస్ అసిస్టెంట్ - 4483
ఆఫీసర్ స్కేల్ 1 - 2676
ఆఫీసర్ స్కేల్ సెకండ్ జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ - 754
ఆఫీసర్ స్కేల్ సెకండ్ ఐటీ ఆఫీసర్ - 57
ఆఫీసర్ స్కేల్ II CA - 19
ఆఫీసర్ స్కేల్ సెకండ్ లా ఆఫీసర్ - 18
ట్రెజరీ ఆఫీసర్ స్కేల్ II - 10
మార్కెటింగ్ ఆఫీసర్ స్కేల్ II - 06
అగ్రికల్చర్ ఆఫీసర్ స్కేల్ II - 12
ఆఫీసర్ స్కేల్ సెకండ్ - 80

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Exam results, IBPS, JOBS, RRB

ఉత్తమ కథలు