ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రూరల్ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకి ఇటీవల దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు తాజాగా ప్రిలిమినరీ ఎగ్జామ్ అడ్మిట్ కార్ట్‌లను విడుదల చేసింది. అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్లర్క్ పరీక్షను ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు అంచెల్లో నిర్వహిస్తారు. ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ నిర్వహిస్తారు. మెయిన్స్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. కాగా, ఈ ప్రిలిమినరీ పరీక్షను దేశవ్యాప్తంగా ఆగస్టు 8, 14 తేదీల్లో నిర్వహించనున్నారు.
Indian Railways: రైల్వే శాఖలో భారీగా ఉద్యోగాలు.. దరఖాస్తుకు నేడే చివరి తేదీ.. వివరాలివే..
అడ్మిట్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
స్టెప్ 1: ఐబీపీఎస్ అధికారిక వెబ్సైట్ www.ibps.in ను సందర్శించండి.
స్టెప్ 2: ఇప్పుడు ‘సిఆర్పి ఆర్ఆర్బి’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 3: సిఆర్పి–ఆర్ఆర్బి ఎక్స్ ఆఫీస్ అసిస్టెంట్ ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష కాల్ లెటర్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 4: మీ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ లేదా పాస్వర్డ్ ఎంటర్ చేసి, క్యాప్చాను ధ్రువీకరించండి.
స్టెప్ 5: ఐబీపీఎస్ ఆర్ఆర్బి–2021 క్లర్క్ అడ్మిట్ కార్డు ప్రత్యక్షమవుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి.
మొత్తం 5830 క్లర్క్ పోస్టులు
ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5830 క్లర్క్ పోస్టులను భర్తీ చేయనున్నారు. గతేడాది అక్టోబర్‌లో విడుదలైన ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ ద్వారా కేవలం 2,557 పోస్టులనే భర్తీ చేశారు. ఈ సారి రెట్టింపు సంఖ్యలో నియామకాలు చేపట్టడం విశేషం. అందువల్ల, ఈసారి కాంపిటీషన్ కూడా పెరిగే అవకాశం ఉంది.
ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్
ప్రిలిమినరీ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో మొత్తం మూడు విభాగాలుంటాయి. పరీక్షకు గంట సమయం కేటాయించారు. అంటే ఒక్కో విభాగానికి 20 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 30 ప్రశ్నలకు 30 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నలకు 35 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నలకు 35 మార్కులు కేటాయించారు. తప్పు సమాధానానికి నెగెటివ్ మార్కు కూడా ఉంటుంది. ప్రతి విభాగంలో మినిమం కటాఫ్ మార్కులు సాధించాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank Jobs 2021, Exam results, IBPS, RRB