Home /News /jobs /

IBPS RESULTS IBPS RRB EXAM RESULTS RELEASED CHECK HERE TO KNOW DETAILS VB

IBPS Results: ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పరీక్ష ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ & పర్సనల్ సెలక్షన్ (IBPS) క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల అయ్యాయి. IBPS క్లర్క్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితం /స్కోర్ కార్డ్ 2022 అధికారిక వెబ్ పోర్టల్ ibps.inలో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. IBPS CRB క్లర్క్ XII పరీక్షలో హాజరైన అభ్యర్థులు వారి రిజిస్ట్రేషన్ నంబర్/రోల్ నంబర్ మరియు పాస్‌వర్డ్ వారీగా వారి క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) IBPS క్లర్క్, ఆఫీసర్ ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించింది. IBPS క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ibps.inలో చూసుకోవచ్చు. ఫలితాల లింక్ సెప్టెంబర్ 27, 2022 వరకు ఉంటుంది. సెప్టెంబర్ 2022 ప్రారంభంలో దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాలలో ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించింది ఐబీపీఎస్. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్/రోల్ నంబర్ మరియు పాస్‌వర్డ్/పుట్టిన తేదీతో లాగిన్ చేయవచ్చు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు అక్టోబర్ 2022లో నిర్వహించే ప్రధాన పరీక్షకు హాజరు కావడానికి అర్హులు.

AP-TS Postal GDS Results: పోస్టల్ జీడీఎస్ ఫలితాలు.. ఐదో లిస్ట్ ను ప్రకటించిన అధికారులు..

ఇలా చెక్ చేసుకోండి.. Step 1: అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించండి. దాని కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Step 2: హోమ్ పేజీలో, IBPS క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి. Step 3: లాగిన్ వివరాలను నమోదు చేసి సమర్పించండి. Step 4: మీ ఫలితం స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది. Step 5: డౌన్‌లోడ్ చేసి, భవిష్యత్ సూచన కోసం హార్డ్ కాపీని పొందండి.

Post Office Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోస్టాఫీసులో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్..

స్కోర్‌కార్డ్‌లో అభ్యర్థి పేరు రోల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, కేటగిరీ, దరఖాస్తు చేసిన పోస్ట్, అర్హత స్థితి , మెయిన్స్ పరీక్ష తేదీ ఉంటాయి. ఈ పరీక్షలు సెప్టెంబర్ 3 మరియు 4, 2022 తేదీల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రిలిమ్స్ అర్హత పొందిన అభ్యర్థులు ఇప్పుడు అక్టోబర్ 8, 2022న మెయిన్స్ పరీక్షకు హాజరుకావచ్చు. CPGET ఫలితాలు.. తెలంగాణ కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (CPGET)-2022 ఫలితాలు ఇటీవల విడుదల అయ్యాయి. హైదరాబాద్‌లోని తెలంగాణ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హైయర్‌ ఎడ్యుకేషన్‌ (ఉన్నత విద్యా మండలి) ఛైర్మన్‌ ఆర్‌ లింబాద్రి, ఓయూ వీసీ డి రవీందర్‌ చేతుల మీదుగా ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలో 94.14 శాతం ఉత్తీర్ణతతో అమ్మాయిలు అధికంగా ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 57,262 మంది పరీక్షలకు హాజరుకాగా, వారిలో 54,050 మంది అంటే 94 శాతం మంది అర్హత సాధించారు. ఇదిలా ఉండగా.. యూనివర్సిటీలో సీటు సాధించాలంటే 1 నుంచి 100లోపు ర్యాంక్ వస్తే ఏ స్ట్రీమ్ తీసుకున్న వారికైన వచ్చే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా.. రిజర్వేషన్ అభ్యర్థులకు కాస్త ఎక్కువ ర్యాంక్ వచ్చినా ఓయూ, శాతవాహన వంటి వాటిలో సీటు సాధించే అవకాశం ఉంటుంది.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, IBPS, Ibps rrb, JOBS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు