IBPS Recruitment 2021 | ఐబీపీఎస్ పలు ఖాళీల భర్తీకి ఇటీవల జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు అప్లై చేయడానికి మరో రెండు రోజులే గడువుంది. ఖాళీలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. టీచింగ్, రీసెర్చ్, ఐటీ డిపార్ట్మెంట్లో ఉన్న పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. అసిస్టెంట్ ప్రొఫెసర్, ఫ్యాకల్టీ రీసెర్చ్ అసోసియేట్స్, రీసెర్చ్ అసోసియేట్స్, హిందీ ఆఫీసర్, ఐటీ ఇంజనీర్స్, ఐటీ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్, సాఫ్ట్వేర్ డెవలపర్స్ అండ్ టెస్టర్స్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు 2021 అక్టోబర్ 1న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అప్లై చేయడానికి 2021 అక్టోబర్ 14 చివరి తేదీ. అభ్యర్థులకు ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి రెండువారాల సమయం మాత్రమే ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేముందు విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి. మరి ఈ జాబ్ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.
పీహెచ్డీ లేదా స్టాటిస్టిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ 55 శాతం మార్కులతో పాస్ కావాలి. ఐదేళ్ల అనుభవం తప్పనిసరి.
32 నుంచి 45 ఏళ్లు
రూ.1,66,541
ఫ్యాకల్టీ రీసెర్చ్ అసోసియేట్స్
పీహెచ్డీ లేదా ఐదైనా సబ్జెక్ట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ 55 శాతం మార్కులతో పాస్ కావాలి.
27 నుంచి 40 ఏళ్లు
రూ.98,651
రీసెర్చ్ అసోసియేట్స్
సైకాలజీ, ఎడ్యుకేషన్, సైకలాజికల్ మెజర్మెంట్, సైకోమెట్రిక్స్, మేనేజ్మెంట్ లాంటి సబ్జెక్ట్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ 55 శాతం మార్కులతో పాస్ కావాలి. ఏడాది అనుభవం తప్పనిసరి.
21 నుంచి 30 ఏళ్లు
రూ.74,203
హిందీ ఆఫీసర్
హిందీ సబ్జెక్ట్‌లో గ్రాడ్యుయేషన్ లేదా మాస్టర్స్ డిగ్రీ పాస్ కావాలి. ఏడాది అనుభవం తప్పనిసరి.
21 నుంచి 30 ఏళ్లు
రూ.74,203
ఐటీ ఇంజనీర్స్ (డేటా సెంటర్)
కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీలో ఫుల్ టైమ్ బీఈ, బీటెక్ డిగ్రీ పాస్ కావాలి. మూడేళ్ల అనుభవం తప్పనిసరి.
Step 4- అభ్యర్థి తన పూర్తి వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
Step 5- ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఇమెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా వస్తాయి.
Step 6- రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి.
Step 7- ఫోటో, సంతకం, ఎడమచేతి వేలి ముద్ర, చేతితో రాసిన డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి.
Step 8- దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
Step 9- దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేసి అప్లికేషన్, ఫామ్ డౌన్లోడ్ చేయాలి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.