హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IBPS Notification: నిరుద్యోగులకు శుభవార్త.. ఆ ఉద్యోగాల భర్తీకి ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌.. ఇంటర్వ్యూలు ఎప్పుడంటే?

IBPS Notification: నిరుద్యోగులకు శుభవార్త.. ఆ ఉద్యోగాల భర్తీకి ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌.. ఇంటర్వ్యూలు ఎప్పుడంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నిరుద్యోగులకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) గుడ్‌న్యూస్‌ అందించింది. వివిధ బ్యాంకుల్లో పలు స్థాయిల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు డిసెంబర్ 14న వాక్-ఇన్ ఇంటర్వ్యూలను నిర్వహించనుంది. 

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

నిరుద్యోగులకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) గుడ్‌న్యూస్‌ అందించింది. వివిధ బ్యాంకుల్లో పలు స్థాయిల్లో ఉద్యోగాలను (Bank Jobs) భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు డిసెంబర్ 14న వాక్-ఇన్ ఇంటర్వ్యూలను నిర్వహించనుంది. అర్హులైన అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూ కోసం డిసెంబర్ 14న ఉదయం 9 గంటల నుంచి 10 గంటల లోపు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్, Ibps హౌస్, 90 Ft Dp రోడ్, ఠాకూర్ పాలిటెక్నిక్ వెనుక, Off. W E హైవే, కండివాలి (తూర్పు), ముంబై 400101 చిరునామాలో ఇంటర్వ్యూలు జరగనున్నాయి.

అర్హత ప్రమాణాలు

BTech/ MCA లేదా BSc-IT/ BCA/ BSc కంప్యూటర్ సైన్స్ లేదా అందుకు సమానమైన డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూలకు హాజరుకావడానికి అర్హులు. వారి వయసు తప్పనిసరిగా 23 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి.

Jobs in AP: ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 461 ఖాళీలకు నోటిఫికేషన్.. ఇలా అప్లై చేసుకోండి

ఈ స్కిల్స్ తప్పనిసరి

B.Tech/MCA డిగ్రీ చేసిన అభ్యర్థులు కనీసం ఒక సంవత్సరం పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉండడం తప్పనిసరి. B.Tech/ M.C.A కాకుండా ఇతర డిగ్రీలు చేసిన అభ్యర్థులు ఫైల్ హ్యాండ్లింగ్, డేటా ఎంట్రీ, డేటా ట్రాన్స్‌ఫర్‌తో సహా UNIX / Linuxలో వివిధ అప్లికేషన్‌లను హ్యాండిల్ చేయడంలో కనీసం 2 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అంతేకాకుండా ఏదైనా భాషలో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ బేసిక్ నాలెడ్జ్, MS-Excel పై పూర్తి అవగాహన ఉండాలి.

ఎంపిక ప్రక్రియ

IBPS ముంబైలో డాక్యుమెంట్ వెరిఫికేషన్, షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్ పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా అవసరమైన అన్ని డాక్యుమెంట్స్, సర్టిఫికేట్‌లను ఒరిజినల్ ఫారమ్‌లో తీసుకురావాలి. అలాగే ఒక్కొక్కటి మూడు సెట్ల ఫోటోకాపీలను వెంట తెచ్చుకోవాలి. ఇంకా, A-4 పేపర్ సైజ్‌లో అప్లికేషన్ (ఒరిజినల్ + రెండు ఫోటోకాపీలు) తీసుకురావాల్సి ఉంటుంది.

జీతభత్యాలు

ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ ద్వారా ఎంపికైన వారికి ప్రస్తుత పాలసీ ప్రకారం రూ. 9,00,000 (సుమారు) వార్షిక CTC లభించనుంది. ఎంప్లాయర్ PF కాంట్రిబ్యూషన్, మెడికల్ బెనిఫిట్స్, మెడిక్లెయిమ్, LTC, హౌసింగ్ లోన్‌పై వడ్డీ రాయితీ, వార్తాపత్రిక బిల్లు రీయింబర్స్‌మెంట్, క్యాంటీన్ సబ్సిడీ, గ్రాట్యుటీ, సూపర్‌యాన్యుయేషన్ వంటి ప్రయోజనాలు ఉద్యోగులకు నిబంధనల ప్రకారం పొందవచ్చు.

ఉద్యోగ బాధ్యతలు

ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ పోస్ట్‌కు ఎంపికైన అభ్యర్థులు Unix ప్లాట్‌ఫారమ్‌లో ఫైల్ సిస్టమ్‌ను హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా 'vi' ఎడిటర్ ద్వారా ఫైల్స్ క్రియేషన్, మోడిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా వివిధ ఇన్‌పుట్ పారామీటర్స్ పాసింగ్ చేస్తూ ఎక్జిక్యూటబుల్ ప్రోగ్రామ్స్ ద్వారా డేటా ఫైల్‌లను ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. తద్వారా Linux ప్లాట్‌ఫారమ్‌లో అవసరమైన అవుట్‌పుట్‌ను జనరేట్‌ చేయాల్సి ఉంటుంది.

First published:

Tags: Bank Jobs, Bank Jobs 2022, IBPS, JOBS

ఉత్తమ కథలు