IBPS PO Recruitment 2021: ప్రభుత్వ బ్యాంకుల్లో 4,135 ఉద్యోగాలకు నోటిఫికేషన్... డిగ్రీ పాస్ అయితే చాలు

IBPS PO Recruitment 2021: ప్రభుత్వ బ్యాంకుల్లో 4,135 ఉద్యోగాలకు నోటిఫికేషన్... డిగ్రీ పాస్ అయితే చాలు (ప్రతీకాత్మక చిత్రం)

IBPS PO Recruitment 2021 | ఐబీపీఎస్ ప్రభుత్వ బ్యాంకుల్లో (Govt Bank Jobs) ప్రొబెషనరీ ఆఫీసర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    ప్రభుత్వ బ్యాంకుల్లో ఉద్యోగాలు (Bank Jobs) కోరుకునేవారికి అలర్ట్. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ప్రొబెషనరీ ఆఫీసర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 4,135 ఉద్యోగాలున్నాయి. మొత్తం 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ పోస్టుల్ని భర్తీ చేస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనెరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు 2021 అక్టోబర్ 20న దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుంది. అప్లై చేయడానికి 2021 నవంబర్ 10 చివరి తేదీ. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే ఖాళీల వివరాలు, విద్యార్హతల వివరాలు తెలుసుకోండి.

    IBPS PO Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన తేదీలు





















































     ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం 2021 అక్టోబర్ 20
     దరఖాస్తుకు చివరి తేదీ  2021 నవంబర్ 10
     దరఖాస్తు ఫీజు చెల్లింపు  2021 అక్టోబర్ 20 నుంచి నవంబర్ 10
    ప్రిలిమినరీ ఎగ్జామ్ కాల్ లెటర్ విడుదల  2021 నవంబర్ లేదా డిసెంబర్
     ప్రిలిమినరీ ఎగ్జామ్  2021 డిసెంబర్ 4 నుంచి 12
     ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫలితాల విడుదల  2021 డిసెంబర్ లేదా 2022 జనవరి
     మెయిన్ ఎగ్జామ్ కాల్ లెటర్ విడుదల  2021 డిసెంబర్ లేదా 2022 జనవరి
     మెయిన్ ఎగ్జామ్  2022 జనవరి
     మెయిన్ ఎగ్జామ్ ఫలితాల విడుదల  2022 జనవరి లేదా ఫిబ్రవరి
     ఇంటర్వ్యూ కాల్ లెటర్ విడుదల  2022 ఫిబ్రవరి
     ఇంటర్వ్యూ  2022 ఫిబ్రవరి లేదా మార్చి
     ప్రొవిజనల్ అలాట్‌మెంట్  2022 ఏప్రిల్

    APPSC Recruitment 2021: ఆంధ్రప్రదేశ్‌లో డీపీఆర్‌ఓ ఉద్యోగాలు... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

    IBPS PO Recruitment 2021: ఖాళీల వివరాలు





















































     మొత్తం ఖాళీలు  4,135
     బ్యాంక్ ఆఫ్ ఇండియా  588
     బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర  400
     కెనెరా బ్యాంక్  650
     సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  620
     ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్  98
     పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్  427
     యూకో బ్యాంక్  440
     యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  912
     పంజాబ్ నేషనల్ బ్యాంక్  పోస్టుల సంఖ్యను వెల్లడించాల్సి ఉంది
     ఇండియన్ బ్యాంక్  పోస్టుల సంఖ్యను వెల్లడించాల్సి ఉంది
     బ్యాంక్ ఆఫ్ బరోడా  పోస్టుల సంఖ్యను వెల్లడించాల్సి ఉంది

    Railway Jobs 2021: సికింద్రాబాద్, విజయవాడ, తిరుపతిలో రైల్వే జాబ్స్... సెలెక్షన్ ప్రాసెస్ ఇదే

    IBPS PO Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    విద్యార్హతలు- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి.

    ఎంపిక విధానం- ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ.

    వయస్సు- 2021 అక్టోబర్ 1 నాటికి 20 నుంచి 30 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది.

    దరఖాస్తు ఫీజు- రూ.850. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులకు రూ.175.

    ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
    Published by:Santhosh Kumar S
    First published: