హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IBPS PO Recruitment 2021: డిగ్రీ అర్హతతో 4,135 బ్యాంక్ ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

IBPS PO Recruitment 2021: డిగ్రీ అర్హతతో 4,135 బ్యాంక్ ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

IBPS PO Recruitment 2021: డిగ్రీ అర్హతతో 4,135 బ్యాంక్ ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు
(ప్రతీకాత్మక చిత్రం)

IBPS PO Recruitment 2021: డిగ్రీ అర్హతతో 4,135 బ్యాంక్ ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)

IBPS PO Recruitment 2021 | ప్రభుత్వ బ్యాంకుల్లో 4,135 ప్రొబెషనరీ ఆఫీసర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ దరఖాస్తు ప్రక్రియ (Application Process) కొనసాగుతోంది. అప్లై చేయడానికి మరో 2 రోజులే గడువుంది. ఈ ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.

ఇంకా చదవండి ...

బ్యాంక్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతున్నారా? బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం మీ కలా? బ్యాంక్ ఉద్యోగం (Bank Jobs) కోసం కోచింగ్ తీసుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ (Application process) ప్రారంభించింది. అక్టోబర్ 19న ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైన సంగతి తెలిసిందే. అక్టోబర్ 20న అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభమైంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనెరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ఐబీపీఎస్ దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది.

Railway Jobs 2021: సికింద్రాబాద్, విజయవాడ, తిరుపతిలో రైల్వే జాబ్స్... సెలెక్షన్ ప్రాసెస్ ఇదే

జాబ్ నోటిఫికేషన్ (Job Notification) ద్వారా ఐబీపీఎస్ ప్రొబెషనరీ ఆఫీసర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 4,135 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2021 నవంబర్ 10 లాస్ట్ డేట్. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, విద్యార్హతల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఈ పోస్టులకు ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.

APPSC Recruitment 2021: ఆంధ్రప్రదేశ్‌లో డీపీఆర్‌ఓ ఉద్యోగాలు... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

IBPS PO Recruitment 2021: దరఖాస్తు చేయండి ఇలా


Step 1- అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్‌లో https://www.ibps.in/crp-po-mt-xi/ దరఖాస్తు చేయాలి.

Step 2- ఈ లింక్ క్లిక్ చేసిన తర్వాత నోటిఫికేషన్, ముఖ్యమైన తేదీలు, అప్లికేషన్ లింక్స్ వేర్వేరుగా ఉంటాయి.

Step 3- Clicke here to apply Online for Common Recruitment Process for PO/MT- XI లింక్ పైన క్లిక్ చేయాలి.

Step 4- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Click here for New Registration పైన క్లిక్ చేయాలి.

Step 5- ఆ తర్వాత ఆరు దశల్లో అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. మొదటి దశలో పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలన్నీ ఎంటర్ చేయాలి.

Step 6- రెండో స్టేజ్‌లో ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.

Step 7- మూడో దశలో ఇతర వివరాలన్నీ ఎంటర్ చేయాలి.

Step 8- నాలుగో దశలో అప్లికేషన్ వివరాలన్నీ సరిచూసుకోవాలి.

Step 9- ఐదో దశలో ఎడమ చేతి వేలి ముద్ర, చేతితో రాసిన డిక్లరేషన్ అప్‌లోడ్ చేయాలి.

Step 10- ఆరో దశలో దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.

ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

అభ్యర్థులు 2021 నవంబర్ 10 లోగా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. ఫీజు కూడా నవంబర్ 10 లోగా చెల్లించాలి. 2021 డిసెంబర్ 4 నుంచి 12 వరకు ప్రిలిమినరీ ఎగ్జామ్, 2022 జనవరిలో మెయిన్ ఎగ్జామ్, 2022 ఫిబ్రవరి లేదా మార్చిలో ఇంటర్వ్యూ ఉంటాయి.

First published:

Tags: Bank Jobs 2021, CAREER, Govt Jobs 2021, IBPS, Job notification, JOBS

ఉత్తమ కథలు