IBPS PO Jobs: బ్యాంకుల్లో 4,336 ప్రొబెషనరీ ఆఫీసర్ ఉద్యోగాలు... సిలబస్ ఇదే

IBPS PO Recruitment 2019 | ఐబీపీఎస్ పీఓ పరీక్షల్లో ఆబ్జెక్టీవ్ ప్రశ్నలకు తప్పు సమాధానాలు రాస్తే ప్రతీ తప్పుడు సమాధానానికి 0.25 మార్కుల్ని తగ్గిస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు ఇది వర్తిస్తుంది.

news18-telugu
Updated: August 9, 2019, 3:12 PM IST
IBPS PO Jobs: బ్యాంకుల్లో 4,336 ప్రొబెషనరీ ఆఫీసర్ ఉద్యోగాలు... సిలబస్ ఇదే
IBPS PO Jobs: బ్యాంకుల్లో 4,336 ప్రొబెషనరీ ఆఫీసర్ ఉద్యోగాలు... సిలబస్ ఇదే (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 9, 2019, 3:12 PM IST
కొద్ది రోజుల క్రితం 4,336 ప్రొబెషనరీ ఆఫీసర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్-IBPS నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. దేశంలోని ప్రముఖ బ్యాంకుల్లో ఈ పోస్టుల్ని నియమించనుంది ఐబీపీఎస్. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అర్హత డిగ్రీ. అభ్యర్థులు కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌కు దరఖాస్తు చేసుకోవాలి. బ్యాంకుల వారీగా పోస్టులు, ముఖ్యమైన తేదీల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక పరీక్షల విషయానికి వస్తే ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్స్‌, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తుంది ఐబీపీఎస్. ప్రిలిమ్స్‌లో 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో 30 ప్రశ్నలకు 30 మార్కులు, క్వాంటిటీవ్ యాప్టిట్యూడ్‌లో 35 ప్రశ్నలకు 35 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీలో 35 ప్రశ్నలకు 35 మార్కులు ఉంటాయి. మూడు అంశాలకు 20 నిమిషాల చొప్పున మొత్తం 60 నిమిషాల్లో పరీక్ష రాయాలి. అభ్యర్థులు ప్రతీ అంశంలో క్వాలిఫై కావాల్సి ఉంటుంది. కటాఫ్ మార్కుల్ని ఐబీపీఎస్ నిర్ణయిస్తుంది.

Read this: Bank Jobs: డిగ్రీ పాసయ్యారా? 4,336 బ్యాంక్ జాబ్స్... ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ

ibps po 2019 notification, ibps po 2019 apply online, ibps po 2019 syllabus, ibps po exam 2019, ibps po prelims syllabus, ibps po mains syllabus, ఐబీపీఎస్ పీఓ 2019 నోటిఫికేషన్, ఐబీపీఎస్ పీఓ దరఖాస్తు, ఐబీపీఎస్ పీఓ 2019 సిలబస్, ఐబీపీఎస్ పీఓ ఎగ్జామ్ 2019, ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్ సిలబస్, ఐబీపీఎస్ పీఓ మెయిన్స్ సిలబస్
Source: IBPS


ఐబీపీఎస్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయినవాళ్లు మెయిన్స్‌కు అర్హత సాధిస్తారు. మెయిన్స్‌లో 155 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్‌లో 45 ప్రశ్నలకు 60 మార్కులు, జనరల్ / ఎకానమీ / బ్యాంకింగ్ అవేర్‌నెస్‌లో 40 ప్రశ్నలకు 40 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో 35 ప్రశ్నలకు 40 మార్కులు, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్‌లో 35 ప్రశ్నలకు 60 మార్కులు ఉంటాయి. రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్‌కు 60 నిమిషాలు, జనరల్ / ఎకానమీ / బ్యాంకింగ్ అవేర్‌నెస్‌కు 35 నిమిషాలు, ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కు 40 నిమిషాలు, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్‌‌కు 45 నిమిషాల సమయం ఉంటుంది. మొత్తం 3 గంటలు. ఇవి కాకుండా ఇంగ్లీష్‌లో లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే అంశంలో రెండు ప్రశ్నలకు 25 మార్కులు ఉంటాయి. 30 నిమిషాల సమయం ఉంటుంది.



Read this: Air India Jobs: ఎయిర్ ఇండియాలో 355 ఉద్యోగాలు... ప్రాంతాలవారీగా పోస్టులివే

ibps po 2019 notification, ibps po 2019 apply online, ibps po 2019 syllabus, ibps po exam 2019, ibps po prelims syllabus, ibps po mains syllabus, ఐబీపీఎస్ పీఓ 2019 నోటిఫికేషన్, ఐబీపీఎస్ పీఓ దరఖాస్తు, ఐబీపీఎస్ పీఓ 2019 సిలబస్, ఐబీపీఎస్ పీఓ ఎగ్జామ్ 2019, ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్ సిలబస్, ఐబీపీఎస్ పీఓ మెయిన్స్ సిలబస్
Source: IBPS


ఐబీపీఎస్ పీఓ పరీక్షల్లో ఆబ్జెక్టీవ్ ప్రశ్నలకు తప్పు సమాధానాలు రాస్తే ప్రతీ తప్పుడు సమాధానానికి 0.25 మార్కుల్ని తగ్గిస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు ఇది వర్తిస్తుంది. ఒకవేళ ప్రశ్న రాయకుండా ఖాళీగా వదిలేస్తే పెనాల్టీ ఉండదు. ఐబీపీఎస్ పీఓ పోస్టులకు దరఖాస్తులు చేసిన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతితో పాటు దేశంలోని పలు నగరాల్లో ప్రీ-ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఉంటుంది. ఇది ఉచిత శిక్షణ. దరఖాస్తు సమయంలోనే ప్రీ-ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కోసం వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
Loading...
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Photos: రెడ్‌మీ కే 20 ప్రో స్మార్ట్‌ఫోన్‌తో తళుక్కుమన్న బాలీవుడ్ తారలు


ఇవి కూడా చదవండి:

Jobs: వామ్మో... లక్షల్లో ఆదాయమిచ్చే ఈ జాబ్స్ గురించి తెలుసుకుంటే షాకవ్వాల్సిందే

LIC Jobs: ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్‌లో 300 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

NTPC Jobs: ఇంజనీరింగ్ చదివారా? ఎన్‌టీపీసీలో 203 ఖాళీలు
First published: August 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...