హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Job Notifications: నిరుద్యోగులకు అలర్ట్... ఈ 7,411 ఉద్యోగాలకు అప్లై చేయడానికి 2 రోజులే గడువు

Job Notifications: నిరుద్యోగులకు అలర్ట్... ఈ 7,411 ఉద్యోగాలకు అప్లై చేయడానికి 2 రోజులే గడువు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Job Notifications | టెన్త్ పాస్ అయ్యారా? ఇంటర్ చదివారా? డిగ్రీ పూర్తి చేశారా? వేర్వేరు జాబ్ నోటిఫికేషన్స్ ద్వారా 7411 ఖాళీలున్నాయి. అప్లై చేయడానికి మరో 2 రోజులే గడువుంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

నిరుద్యోగులకు అలర్ట్. ప్రతీ నెలా కొన్ని జాబ్ నోటిఫికేషన్స్ విడుదలవుతూనే ఉన్నాయి. ఇటీవల రిలీజ్ అయిన జాబ్ నోటిఫికేషన్స్ (Job Notifications) దరఖాస్తు గడువు త్వరలో ముగియనుంది. ఐబీపీఎస్, కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ, భారతీయ రైల్వే (Indian Railways), ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ జారీ చేసిన నోటిఫికేషన్స్‌కు దరఖాస్తు చేయడానికి 2021 నవంబర్ 10 చివరి తేదీ. ఈ 5 నోటిఫికేషన్స్ ద్వారా 7,411 ఉద్యోగాలున్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ లాంటి కోర్సులు పాస్ అయినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడాలి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి. మరి ఏ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలున్నాయి, నోటిఫికేషన్ల వివరాలేంటీ తెలుసుకోండి.

DRDO Jobs 2021: డీఆర్‌డీఓలో 116 పోస్టులు... ఖాళీల వివరాలు ఇవే

IBPS PO Recruitment 2021: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. మొత్తం 4,135 పోస్టులున్నాయి. ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రొబెషనరీ ఆఫీసర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులున్నాయి. దరఖాస్తు చేయడానికి 2021 నవంబర్ 10 చివరి తేదీ. డిగ్రీ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Ayush Recruitment 2021: కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సెంట్రల్ ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ యూనిట్ (CPMU) కోసం సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్, జూనియర్ ప్రోగ్రామ్ మేనేజర్, ప్రోగ్రామ్ మేనేజర్, డేటా అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 7 ఖాళీలున్నాయి. ఇక్కడ క్లిక్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

IOCL Recruitment 2021: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 1968 పోస్టులు... ఇలా అప్లై చేయండి

West Central Railway Recruitment 2021: వెస్ట్ సెంట్రల్ రైల్వే భారీగా అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 2226 ఖాళీలున్నాయి. అప్లై చేయడానికి 2021 నవంబర్ 10 చివరి తేదీ. అప్రెంటీస్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్, ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

NFL Recruitment 2021: నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (NFL) నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 183 పోస్టులున్నాయి. జూనియర్​ ఇంజినీరింగ్ అసిస్టెంట్​, లోకో అటెండెంట్, అటెండెంట్, మార్కెటింగ్​ పోస్టులున్నాయి. నవంబర్​ 10 లోగా అప్లై చేయాలి. పూర్తి వివరాలు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.

APPSC Recruitment 2021: బీటెక్ పాస్ అయినవారికి అలర్ట్... ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలు

FCI recruitment 2021: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో భారీగా ఖాళీలున్నాయి. వాచ్‌మెన్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఎఫ్‌సీఐ. మొత్తం 860 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి మరో 2 రోజులే గడువుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

First published:

Tags: Bank Jobs 2021, CAREER, Govt Jobs 2021, IBPS, Indian Railway, Indian Railways, Job notification, JOBS, Railway Apprenticeship, Railway jobs, Railways

ఉత్తమ కథలు