Home /News /jobs /

IBPS HAS RELEASED THE ADMIT CARD FOR THE MAINS EXAM TO BE CONDUCTED FOR THE POST OF REGIONAL RURAL BANKS OFFICERS SCALE 1 HERE HOW TO DOWNLOAD DETAILS GH SRD

IBPS PO admit card: ఐబీపీఎస్ పీఓ మెయిన్స్ అడ్మిట్​కార్డుల విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

IBPS PO admit card: ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ప్రొబేషనరీ ఆఫీసర్స్​ (PO) మెయిన్స్​ అడ్మిట్​ కార్డులను విడుదల చేసింది. ఐబీపీఎస్​ అధికారిక వెబ్‌సైట్ www. ibps.in నుంచి అడ్మిట్ కార్డులను డౌన్​లోడ్ చేసుకోవచ్చు.

ఇంకా చదవండి ...
ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ప్రొబేషనరీ ఆఫీసర్స్​ (PO) మెయిన్స్​ అడ్మిట్​ కార్డులను విడుదల చేసింది. ఐబీపీఎస్​ అధికారిక వెబ్‌సైట్ www. ibps.in నుంచి అడ్మిట్ కార్డులను డౌన్​లోడ్ చేసుకోవచ్చు. దేశంలోని వివిధ రీజినల్ రూరల్ బ్యాంక్స్ (RRB)లో ఆఫీసర్ స్కేల్ 1 పోస్ట్​ల నియామకం కోసం ఐబీపీఎస్​ గత నెలలో ప్రిలిమ్స్​ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఇప్పుడు మెయిన్స్​ నిర్వహించనుంది. మెయిన్స్​​లో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా ఫైనల్​ సెలక్షన్ ఉంటుంది. ఈ మెయిన్స్​​ పరీక్ష దేశవ్యాప్తంగా వివిధ సెంటర్లలో సెప్టెంబర్ 25న జరగనుంది. మరోవైపు ఐబీపీఎస్​ ఆర్​ఆర్​బీ స్కేల్ I పోస్టుల సంఖ్యను కూడా పెంచింది. తొలుత నోటిఫికేషన్​ విడుదల చేసిన సమయంలో 4,257 ఆఫీసర్ స్కేల్ I ఖాళీలను పేర్కొనగా.. ఇప్పుడు వాటిని 4.716 పోస్టులకు పెంచింది.

* అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?
ముందు ఐబీపీఎస్​ అధికారిక వెబ్‌సైట్ www.ibps.in ని సందర్శించండి. హోమ్‌పేజీలో పీఓ అడ్మిట్​ కార్డు స్క్రోలింగ్ కనిపిస్తుంది. ఆ లింక్‌పై క్లిక్ చేయండి. వెంటనే మీకు అడ్మిట్​ కార్డు డౌన్​లోడ్​ పేజీ ప్రత్యక్షమవుతుంది. అక్కడ మీ హాల్​టికెట్​ నంబర్​ వివరాలు నమోదు చేసి లాగిన్ అవ్వండి.

మీ అడ్మిట్ కార్డ్ ప్రత్యక్షమవుతుంది. దాన్ని డౌన్‌లోడ్ చేయండి. ఆ తర్వాత ప్రింటవుట్​తీసుకొని ఎగ్జామ్​ హాల్​కు తీసుకెళ్లండి. అభ్యర్థులు పరీక్ష తేదీన అడ్మిట్ కార్డ్ ప్రింటెడ్ కాపీతో పాటు వ్యాలిడ్​ ఐడి ప్రూఫ్‌ను పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు భారీ నష్టం.. ఒక్క టెస్ట్ రద్దవడం వల్ల ఇన్ని వందల కోట్లు ఫసక్...

* ప్రతి సెక్షన్​లో మినిమం కటాఫ్​..
మెయిన్స్​లో ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి విభాగంలో మినిమం కటాఫ్​ మార్కులు సాధించాల్సి ఉంటుంది. మెయిన్స్​లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూకు 100 మార్కులు కేటాయించారు. మెయిన్స్​, ఇంటర్వ్యూ రెండింటిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్​ సెలక్షన్​ ఉంటుంది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, ఆఫీసర్ స్కేల్ -1కి సెలక్ట్​ అయిన వారికి ప్రతినెలా ఇన్-హ్యాండ్ జీతం రూ. 30,000 నుంచి రూ. 35,000 వరకు అందుతుంది. వీటికి అదనంగా అలవెన్సులు ఉంటాయి.
Published by:Sridhar Reddy
First published:

Tags: Bank Jobs 2021, Exams, IBPS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు