IBPS Exam: బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా.. ఉద్యోగమే లక్ష్యం అయితే ఈ టిప్స్ పాటించండి..
ప్రతీకాత్మక చిత్రం
దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంకుల్లో వివిధ పోస్టుల భర్తీ కోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ఏటా క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది. ఈ బ్యాంకుల తరపున ఐబీపీఎస్ దాదాపు 200 నగరాలు/పట్టణాల్లో కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ (CRP)ని నిర్వహిస్తుంది.
దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు(Banks), రీజనల్ రూరల్ బ్యాంకుల్లో(RRBs) వివిధ పోస్టుల భర్తీ కోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ఏటా క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు(Notifications) విడుదల చేస్తుంది. ఈ బ్యాంకుల తరపున ఐబీపీఎస్(IBPS) దాదాపు 200 నగరాలు/పట్టణాల్లో కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ (CRP)ని నిర్వహిస్తుంది. ఐబీపీఎస్ పీఓ (ప్రొబేషనరీ ఆఫీసర్స్), ఐబీపీఎస్ ఓస్ఓ (Specialist Officers), ఐబీపీఎస్ క్లర్క్, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ (Region Rural Banks) నోటిఫికేషన్లను ఏటా క్రమం తప్పకుండా విడుదల చేస్తుంది. ఈ పరీక్షల్లో నెగ్గాలంటే ఎలాంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫాలో అవ్వాలో తెలుసుకుందాం.
ఐబీపీఎస్ ఎగ్జామ్ ప్యాటర్న్..
పై నాలుగు పరీక్షలకు సంబంధించిన సిలబస్ దాదాపు ఒకే విధంగా ఉంటుంది. అయితే, పోస్టును బట్టి ప్రశ్నల క్లిష్టత స్ఠాయి, పరీక్షా సరళి మారుతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిలోనూ ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ రూపంలో అడుగుతారు. ఐబీపీఎస్ పీఓ మెయిన్స్‌లో లెటర్ రైటింగ్, ఎస్సే పరీక్ష కూడా ఉంటుంది. సమాధానం కేవలం ఇంగ్లిష్‌లోనే రాయాలి. ఐబీపీఎస్ ప్రిలిమ్స్‌లో ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత ఉంటుంది. ఐబీపీఎస్ పీఓ, క్లర్క్ ప్రిలిమ్స్‌లో న్యూమరికల్ ఎబిలిటీ (NA), రీజనింగ్ ఎబిలిటీ (RA), ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెక్షన్ల నుంచి ప్రశ్నలు వస్తాయి.
ఐబీపీఎస్ మెయిన్స్ పరీక్షలో న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ, ఇంగ్లీష్ భాషతో పాటు జనరల్/ఫైనాన్షియల్/బ్యాంకింగ్ అవేర్నెస్, ప్రొఫెషనల్ నాలెడ్జ్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్, డేటా అనాలిసిస్, ఇంటర్‌ప్రెటేషన్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రతి విభాగానికి కేటాయించిన ప్రశ్నలు, మార్కులు, సమయం, మొత్తం పరీక్ష సమయం వివిధ ఐబీపీఎస్ పరీక్షలకు భిన్నంగా ఉంటాయి.
ఐబీపీఎస్ ఎస్ఓ, పీఓ పరీక్షల్లో ప్రిలిమ్స్, మెయిన్స్ క్లియర్ చేసిన తర్వాత మాత్రమే అభ్యర్థి ఇంటర్వ్యూ దశకు చేరుకుంటారు. మెయిన్ పరీక్ష (80), ఇంటర్వ్యూ (20) వెయిటేజీ నిష్పత్తి ప్రకారం పొందిన కంబైన్డ్ ఫైనల్ స్కోర్ ద్వారా అభ్యర్థిని ఎంపిక చేస్తారు. అలాగే, అభ్యర్థి మెయిన్స్, ఇంటర్వ్యూ రెండింటిలోనూ కనీస అర్హత మార్కులు సాధించాలి (జనరల్ కటాఫ్ -40%, SC/ST/OBC/PWD అభ్యర్థులకు 35%).
ఐబీపీఎస్‌లో బెస్ట్ స్కోర్ కోసం పాటించాల్సిన చిట్కాలు
IBPS సిలబస్‌పై అవగాహన ఏర్పర్చుకోండి. ఏ అంశంపై ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయో తెలుసుకోండి. ఏ అంశంపై ఎక్కువ అవగాహన లేదో దానిపై ఎక్కువ శ్రద్ధ పెట్టండి. వాటికి ఎక్కువ సమయం కేటాయించండి.
రెగ్యులర్‌గా ప్రాక్టీస్, రివిజన్ చేయండి. ఎందుకంటే ఏదైనా పోటీ పరీక్షను క్లియర్ చేయడానికి స్థిరత్వం చాలా కీలకం. గత పరీక్షా పత్రాలను ప్రాక్టీస్ చేయండి. తద్వారా ప్రశ్నల సరళి తెలుస్తుంది. వీలైనన్ని ఎక్కువ మాక్ టెస్టులు రాయండి. తద్వారా వేగం, కచ్చితత్వం, సమయ నిర్వహణ మెరుగుపడుతుంది. క్విజ్‌లలో పాల్గొనడం ద్వారా మీ పనితీరును అంచనా వేసుకోండి. ప్రతిరోజూ తప్పనిసరిగా న్యూస్ పేపర్ చదవండి. ఐబీపీఎస్‌లో ప్రతి తప్పు సమాధానానికి నెగెటివ్ మార్కింగ్ ఉన్నందున, తెలిసిన ప్రశ్నలను మాత్రమే ప్రయత్నించాలి. అన్ని ప్రశ్నలను కవర్ చేయడం కంటే చాలా ప్రశ్నలకు సరైన సమాధానాలు రాబట్టడంపై దృష్టి పెట్టండి.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.